టైమ్ పెంచేసిన జగన్ ! వారికి ఆరాటం .. వీరికి పోరాటం ?

ఏపీ సీఎం జగన్ ఏం చేసినా దానికి ఒక లెక్క ఉంటుంది.జగన్ నిర్ణయాలు కొన్ని కొన్ని సంచలనం రేపినా, విమర్శల పాలైనా, ఆ తర్వాత వచ్చే ఫలితం మాత్రం సానుకూలంగానే ఉంటుంది.

 Ap Cm Jagan To Postpone Cabinet Expansion, Ap Cm Ys Jagan, Ap Government, Ap Cab-TeluguStop.com

ఇది అనేక విషయాల్లో రుజువు అయ్యింది.ఇక ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం పార్టీ శ్రేణుల్లో ఆసక్తి ఆందోళన పెంచుతున్నాయి.

ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ విషయంలో జగన్ చాలా కాలం నుంచి హడావుడి చేస్తున్నారు.ప్రస్తుతం ఉన్న మంత్రిమండలిని ప్రక్షాళన చేసి, దాదాపు 90 శాతం మందిని కొత్త వారిని నియమించాలని జగన్ చూస్తున్నారు.

ఈ మేరకు లిస్ట్ కూడా ఆయన తయారు చేస్తున్నారనే టాక్ చాలాకాలం నుంచి ఉంది.అయితే జగన్ ఆకస్మాత్తుగా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారట.
ఆరు నెలల పాటు ప్రస్తుత మంత్రిమండలినే కొనసాగించాలని డిసైడ్ అయ్యారు.కరోనా వైరస్ ప్రభావం తో ప్రస్తుత మంత్రులు పూర్తిగా తమ పదవులను అనుభవించలేకపోయారని, మరో ఆరు నెలలు గడువు ఇవ్వడమే బెటర్ అనే అభిప్రాయంలో  జగన్ ఉన్నారు.

దీంతో కొత్త మంత్రిమండలిలో తమకు అవకాశం దక్కుతుందనే నమ్మకం తో ఉన్న నాయకుల్లో మరింత కంగారు మొదలైంది.ఎప్పుడెప్పుడు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేద్దామా అని వారంతా చాలాకాలం నుంచి వేచి చూస్తున్నారు.

జగన్ కొత్త నిర్ణయంతో మరో ఆరు నెలలు వీరు వెయిటింగ్ లోనే ఉండాల్సిన పరిస్థితి. కొత్త మంత్రిమండలిలో రెడ్డి సామాజికవర్గం నాయకులకు ఎక్కువగా ప్రాధాన్యం ఉందని ప్రచారం చాలా రోజుల నుంచి ఉంది జగన్ కు అత్యంత సన్నిహితులైన ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి పెద్దగా మంత్రి మండలిలో అవకాశం దక్కలేదు.

Telugu Ap, Ap Cm, Apcm, Ap Cm Ys Jagan, Ap Ministers, Jagan, Rk Roja, Roja, Srik

దీంతో రెండో మంత్రివర్గ విస్తరణ లో అయినా, వీరందరికీ ప్రాధాన్యత ఇస్తారని అంతా భావిస్తున్నారు.నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి,  శ్రీకాంత్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి , కాకాని గోవర్ధన్ రెడ్డి ఇలా ఎంతోమంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు.అయితే జగన్ మాత్రం కొత్త మంత్రివర్గంలో సామాజిక వర్గాల వారీగా అవకాశం ఇవ్వాలని, బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనతో ఉండడంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగన్ వీర విధేయులకు ఈదఫా లోనూ అవకాశం అంతంతమాత్రంగానే ఉండేలా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube