ఎప్పుడు గ్రూపు రాజకీయాలతో సతమతం అవుతూ ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.పార్టీ అధికారంలో ఉందా లేదా ? అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి ? పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి ? ఇటువంటి ఏ విషయాల పైన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు దృష్టి పెట్టకుండా, కేవలం తమ సీనియారిటీని అందరూ గుర్తించాలని, తమకే అందరూ గౌరవ మర్యాదలు ఇవ్వాలి అనే విధంగా వ్యవహరిస్తూ, పార్టీకి ఏ స్థాయిలో డ్యామేజ్ చేయాలో ఆ స్థాయిలో డ్యామేజ్ చేస్తున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఎదుర్కొంటూనే ఉన్నారు.ఈ పంతాలు, పట్టింపులు కారణంగానే కాంగ్రెస్ తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితి ఎదుర్కొంటున్నా, ఆ పార్టీ నాయకుల్లో మార్పు అయితే కనిపించడం లేదు.
ఇక తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగించిన దగ్గర నుంచి సీనియర్లు ఏదో ఒక సందర్భంలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు.అయితే రాహుల్ తో సమావేశానికి విడివిడిగా హాజరయ్యేందుకు అవకాశం ఉంటుందని, ఈ సందర్భంగా రేవంత్ తో పాటు మరికొందరి పై ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ సీనియర్లు భావించారు.
అయితే ఈ విషయాన్ని ముందుగానే గమనించిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ మూకుమ్మడిగా నే రాహుల్ తో సమావేశాన్ని ఏర్పాటు చేయించారు.దీంతో రేవంత్ తో పాటు మరికొందరిపై ఫిర్యాదులు చేయాలన్న సీనియర్ నాయకులు పంతం నెరవేరలేదు.
రాహుల్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యేందుకు ఎవరికి వారు విడివిడిగా ప్రయత్నాలు చేసినా, అవి ఏవీ వర్కవుట్ కాలేదు.ఇక తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కి ఈ సమావేశం కు రావాలని ఆహ్వానం అందినా, ఆయన డుమ్మా కొట్టారు.
మరికొద్ది రోజుల్లోనే ఆయన ఢిల్లీకి వెళ్లి రాహుల్ , సోనియా గాంధీ లకు తెలంగాణకు సంబంధించిన అంశాల పై ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారట.రాహుల్ తో సమావేశం అయ్యి ఏవేవో అంశాలపై ఫిర్యాదులు చేయాలని చూసినా , చివరకు ఆ సమావేశంలో రాహుల్ చెప్పిన అంశాలను శ్రద్ధగా విని తిరుగు ప్రయాణం కట్టాల్సి రావడంతో సమావేశానికి వెళ్లిన కాంగ్రెస్ సీనియర్లు ఉసూరుమంటూ ఒకరిని ఒకరు ఓడర్చుకున్నారట.