టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే.తన అందంతో యువత హృదయాలను దోచుకున్న ఈ బ్యూటీ తన నటనతో మాత్రం అంత సక్సెస్ అందుకోలేకపోయింది.
మాయాజాలం సినిమాతో తొలిసారిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పరిచయం కాగా ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకుంది.కానీ గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది.
ఇదిలా ఉంటే తాజాగా డ్రగ్స్ వ్యవహారం గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది.
సినిమా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియా వేదికగా మాత్రం అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది పూనమ్ కౌర్.
తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.ఒక్కోసారి ఆమె చేసే ట్వీట్ లు మాత్రం కొన్ని వివాదాలకు దారి తీస్తుంటాయి.
అందులో కొన్ని ఉద్దేశపూర్వకంగా కూడా ఉంటాయి.ఇక రాజకీయ పట్ల కూడా వ్యతిరేకంగా బాగా కౌంటర్లు వేస్తుంటుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు వ్యవహారం బాగా హాట్ టాపిక్ గా మారింది.అందులో కొందరి సెలబ్రెటీల పేర్లు బయట పడగా తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు వారిని విచారిస్తున్నారు.
ఇప్పటికే డైరెక్టర్ పూరి జగన్నాథ్, రకుల్ ప్రీత్ సింగ్, ఛార్మి లు విచారణకు హాజరు అవగా మరికొందరి పేర్లు విచారణలో హాజరవ్వరున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే తాజాగా డ్రగ్స్ కేసు పై పూనమ్ కౌర్ తన ట్విట్టర్ వేదికగా స్పందించింది.డ్రగ్స్ అనేది కేవలం సెలబ్రెటీల సమస్య కాదు అంటూ.ఇది ప్రతి ఒక్కరి సమస్య అని తెలిపింది.
అంతేకాకుండా ఇది ఒక సరిహద్దు సమస్య అంటూ ఇదంతా రాజకీయ ప్రేరణతో జరుగుతున్న వ్యవహారమని తెలిపింది.ఆర్థిక వ్యవస్థకు కూడా సంబంధించిన సమస్య అంటూ ఈ విషయం గురించి తాను కూడా త్వరలోనే తన స్వంత అనుభవాలను పంచుకుంటాను అని తెలిపింది.దీంతో ఈమె పంచుకునే అనుభవాలు ఏంటో అని తెగ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.