దళితులపై కామెంట్ చేసిన మీరా మిథున్‌కు బెయిల్‌ నిరాకరణ!

గత కొద్ది రోజుల క్రితం తమిళనాడు సినీ నటి బిగ్ బాస్ బ్యూటీగా ఎంతో పేరు సంపాదించుకున్న మీరా మిథున్‌ దళితుల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.దళితులు ఎంత చీప్ మెంటాలిటీ కలిగి ఉంటారని, వారికి ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియని, అలాంటి దళితులను ఇండస్ట్రీలో లేకుండా తరిమి కొట్టాలంటే దళితుల పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో అప్పట్లో ఈ విషయం తమిళనాట ఇండస్ట్రీలో తీవ్ర దుమారంగా మారింది.

 Meera Mithun, Bail Rejected, Police Case, Chennai,latest News Viral-TeluguStop.com

ఈ క్రమంలోనే సదరు నటిపైచర్యలు తీసుకోవాలంటూ పెద్దఎత్తున దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

ఈక్రమంలోనే ఈమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ వీసీకే పార్టీ నేత వన్నియరసు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 ఈ విధంగా చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేయడంతో వెంటనే నటి చెన్నై నుంచి కేరళ వెళ్లి దాక్కున్నారు.పోలీసులు తనను ఏమీ చేయలేరని తనను అరెస్టు చేసే ధైర్యం వారికి లేదంటూ పోలీసులకు సవాల్ విసరడంతో పోలీసులు ఆమెను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేశారు.

ఈ క్రమంలోనే కేరళలో దాక్కున్న ఆమె ఆచూకీని కనుగొన్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.

Telugu Chennai, Meera Mithun-Movie

పోలీసులు అరెస్టు చేసే సమయంలో కూడా నానా రచ్చ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం రిమాండ్ లో ఉంది.ఈ క్రమంలోనే సదరు నటి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా కోర్టు నుంచి ఈమెకు తీవ్ర నిరాశ ఎదురైంది అని చెప్పవచ్చు.దళితుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఈమెకు చెన్నై ప్రిన్సిపాల్ సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.

ఈవిధంగా కోర్టు నుంచి బెయిల్ రాకపోవడంతో ఈమెకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది అని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube