పిజ్జా తినేముందు జర జాగ్రత్త.. మరి లేదంటే అంతే సంగతులు..!

ఈ కాలంలో చాలా మంది ఇంట్లో వంట చేయడం మానేశారు.ఎందుకంటే అడుగు బయట పెట్టకుండా, శ్రమలేకుండా ఇంట్లోనే కూర్చిని ఫోన్లో ఆర్డర్ ఇస్తే చాలు ఏది కావాలంటే అది నిమిషాల్లో మీ ఇంటికి వచ్చేస్తుంది.

 Uk Woman ,finds ,nuts ,bolts ,toppings ,domino’s Pizza, Viral News, Viral Late-TeluguStop.com

ప్రజలు కూడా బాగా ఆన్లైన్ ఫుడ్‌ యాప్‌ లపై ఎక్కువగా ఆధారపడిపోయారు.ఇంట్లో వండుకున్న ఆహారం రుచి బయట తినే తిండికి వస్తుందా చెప్పండి.

మనం ఎంతో శుచి, శుభ్రంగా వండుకున్న ఆహారం మనకి రుచించడం లేదు.అందుకే బయట నుంచి తెప్పించుకుని మరి తింటున్నారు.

ఈ మధ్య కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరు కూడా ఫాస్ట్ ఫుడ్ తినేస్తున్నారు.అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిసినా నోటికి రుచిగా ఉండడం వలన ఎక్కువమంది పిజ్జా, బర్గర్ లనే ఇష్టపడుతున్నారు.

అయితే మీరు ఆన్లైన్ లో పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తినండి.ఎందుకంటే పిజ్జాతో పాటు ఇనుప నట్లు, బోల్టులు కూడా వస్తున్నాయి కాబట్టి.

పొరపాటున పిజ్జా చూసిన ఆనందంలో అది ఎలా ఉందో అని చూసుకోకుండా తిన్నారా అంతే సంగతులు.అసలు పిజ్జాలో ఈ ఇనుప నట్లు బోల్టులు రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.? అసలు వివరాల్లోకి వెళితే.ఇంగ్లాండ్‌ లోని లాంకషేర్‌ రాష్ట్రం థార్టన్‌ క్లెవెలెస్‌ జంట నగరాలలో ఉండే ఓ మహిళ పిజ్జా తినాలనిపించి డోమినోస్‌ లో పిజ్జా ఆర్డర్‌ చేసింది.

ఆర్డరు చేసిన కొద్ది సేపటికి పిజ్జా ఇంటికి వచ్చింది.దానిని తిందామని తీసిన సదరు మహిళ పిజ్జా ఓపెన్ చేయగానే దాన్ని చూసి షాక్ అయింది.

Telugu Bolts, Dominos, Finds, Nuts, Uk, Latest-Latest News - Telugu

పిజ్జాను తీసుకుని తింటున్న సమయంలో ఇనుప నట్లు, బోట్లు దర్శనం ఇచ్చాయి.పిజ్జాను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.దానితో పాటు డొమినోస్ కు ఫిర్యాదు ఇవ్వడంతో సంస్థ వెంటనే స్పందించి క్షమాపణ చెప్పింది.ఆ మహిళ పే చేసిన డబ్బులు కూడా తిరిగి ఇచ్చేసింది.ఈ విషయాన్నీ సోషల్‌ మీడియా అకౌంట్ లలో షేర్‌ చేసి ఇలా చెప్పుకొచ్చింది.మీరు తినడానికి ముందు ఒకసారి పిజ్జాలను జాగ్రత్తగా చూసి తినండి.

ముఖ్యంగా థోర్టన్‌ క్లెవ్‌లీస్‌ లోని డొమినోస్‌ నుంచి పిజ్జా ఆర్డర్‌ పెట్టేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఈ విషయం తెలిసి డొమినోస్‌ సంస్థ ఇలా వివరణ ఇచ్చింది.

మీకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్తూ మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చేసుకుంటామని ఓ ప్రకటనలో తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube