ఈ ప్రపంచంలో కొన్ని దేశాలు ఇప్పటికీ కూడా రాజుల పాలనలో సాగుతున్నాయి.అందులో ఒక దేశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇక్కడ రాజు, వారి మంత్రి, సైన్యం ఇలాంటివి ఏవీ ఉండదు.అసలు ఆ దేశంలో లక్షలాది మంది జనం కూడా ఉండరు.
అందుకే దాన్ని ఒక వింత సామ్రాజ్యం అని అంటుంటారు.రాజుకు కిరీటం ఉండకపోవడమే కాదు ఆయన పట్టుబట్టలనేవే ధరించడు.
అంతేకాకుండా ఆ రాజు రాజ్యంలో ఒక సాధారణ మనిషిలాగానే బతుకుతాడు.ఒక చిన్నపాటి నిక్కరు వేసుకుని జీవిస్తుంటాడు.
ప్రపంచంలోనే అతి చిన్న దేశంలో ఇలాంటి విచిత్రాలు ఎన్నో మనకు కనబడుతాయి.ఇటలీలోని సార్డీనియా ప్రావిన్స్ లో టవొలారా దేశంలో ఈ విచిత్రాలను మనం చూడొచ్చు.
ఇది మధ్యధరా సముద్రం వద్ద ఉన్నటువంటి ఒక దీవి మాత్రమే.సుమారుగా ఈ రాజ్యం ఏర్పడి 180 సంవత్సరాలు కావస్తోంది.
ఆ రాజ్యానికి ఆంటోనియో బర్దలివో అనే చక్రవర్తి ఉన్నారు.దీవి మొత్తంగా చూస్తే కేవలం 5 చదరపు కి.మీ.మాత్రమే ఉంది.మరో విశేషం ఏంటంటే ఈ రాజ్యంలో 11 మంది మాత్రమే బతుకుతున్నారు.
మరి ఇటువంటి రాజ్యంలో రాజుకు కేవలం భోజనం మాత్రమే ఉచితంగా ఉంటుంది.
మిగిలినవన్నీ కూడా ఆయన కష్టపడే సంపాదించుకోవాలి.ఈ దీవిలో స్వర్ణ దంతాలు ఉండే మేకలు ఉన్నాయి.
ప్రపంచంలోనే ఇలాంటి మేకలు మరెక్కడా కూడా ఉండవని ప్రజలు చెప్పుకుంటారు.

19వ శతాబ్దంలోనే క్విన్ విక్టోరియా ఆదేశాల మేరకు టవోలారా రాజ కుటుంబం ఫొటోలు బ్రిటన్ లో ఉంచారు.అవి ఇప్పుడు కూడా బకింగ్‌హామ్ ప్యాలెస్ లో మనం చూడొచ్చు.ఈ రాజ్యానికి చుట్టూరా అనేక రకాల జంతువులు, సముద్ర జంతువులు దర్శనమిస్తుంటాయి.
వింతైన మేకలు, గద్దలను మనం ఈ దీవిలో చూడొచ్చు.ఈ దీవిని చూసేందుకు ప్రపంచ దేశాల నుంచి చాలా మంది పడవ ప్రయాణం చేసి అక్కడి వెళ్తుంటారు.