గాయకుడిగా అందుకే నాకు అవకాశాలు తగ్గాయి.. మనో ఏం చెప్పారంటే..?

నటుడిగా, గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో మనో గుర్తింపును సొంతం చేసుకున్నారు.తెలుగుతో పాటు కన్నడ, ఇతర భాషల సినిమాల్లో కూడా మనో సింగర్ గా మంచి పేరును సాధించారు.

 Star Singer Mano Comments About Crazy Uncles Movie , Tollywood ,singer Mano , Cr-TeluguStop.com

బాల్యంలోనే సంగీతంలో శిక్షణ తీసుకున్న మనో నీడ అనే సినిమాలో బాలనటుడిగా నటించారు.మనో అసలు పేరు నాగూర్ బాబు కాగా ప్రముఖ సంగీత దర్శకులలో ఒకరైన ఇళయరాజా పేరును మనోగా మార్చారు.

ఒకప్పుడు సింగర్ గా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న మనోకు ఈ మధ్య కాలంలో సినిమా ఆఫర్లు తగ్గిన సంగతి తెలిసిందే.మనో కీలక పాత్రలో నటించిన క్రేజీ అంకుల్స్ సినిమా ఈ నెల 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

ప్రముఖ దర్శకుడు ఈ.సత్తిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా శ్రీముఖి ఈ సినిమా టీవీ సింగర్ గా కనిపిస్తారని తెలుస్తోంది.మనో మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాలో గోల్డ్ షాప్ ఓనర్ గా తాను కనిపిస్తానని చెప్పుకొచ్చారు.

Telugu Crazy Uncles, Mano, Top-Movie

సినిమాలో తన పాత్ర చాలా సరదాగా ఉంటుందని ఈ సినిమా యువతను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిందని మనో అన్నారు.తనకు నటుడిగా మరికొన్ని సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయని ఈ సినిమా రిజల్ట్ ను బట్టి తాను నిర్ణయం తీసుకుంటానని మనో కామెంట్లు చేశారు.తన సినీ కెరీర్ లో ఇప్పటివరకు సినిమాల కోసం 25వేల పాటలు, ప్రైవేట్ ఆల్బమ్ ల కొరకు మరో 25వేల పాటలు పాడానని మనో తెలిపారు.

ట్రెండ్ మారడం వల్లే తనకు అవకాశాలు తగ్గాయని మనో కామెంట్లు చేశారు.

Telugu Crazy Uncles, Mano, Top-Movie

ప్రతి సింగర్ లో ఆర్టిస్ట్ ఉంటాడని పాట పాడే సమయంలో హీరోను ఊహించుకుని పాట పాడితే పాట పండుతుందని మనో చెప్పారు.భవిష్యత్తులో కామెడీ ప్రధాన పాత్రలు ఎక్కువగా చేస్తానని మనో పేర్కొన్నారు.నటుడిగా విభిన్నమైన పాత్రలు పోషించాలని భావిస్తున్నానని మనో చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube