ఈ నెల 24 నుంచి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.రాష్ట్రమంతా పర్యటించి జనాల్లోకి బిజెపిని తీసుకెళ్లడంతో పాటు, రాబోయే రోజుల్లో తమకు తిరుగు లేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
వాస్తవంగా ఆయన బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మొదట్లోనే పాదయాత్ర చేయాలని చూసినా, హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆగిపోయారు.అయితే ప్రస్తుతం హుజురాబాద్ తో పాటు, సార్వత్రిక ఎన్నికల సమయం కూడా దగ్గరకు రావడంతో, సంజయ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మొదటి విడతగా తన పాదయాత్రను హైదరాబాదులోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి హుజురాబాద్ వరకు నిర్వహించనున్నారు.ఈ విధంగా విడతలవారీగా నాలుగు విడతల్లో తెలంగాణ అంతటా పాదయాత్ర చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఈ పాదయాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందనేది సంజయ్ అభిప్రాయం కాగా, ఈ పాదయాత్ర పై సొంత పార్టీ నేతల్లోనే టెన్షన్ పెరుగుతోంది.
సంజయ్ నియోజకవర్గంలో వచ్చిన సందర్భంగా ఆ యాత్ర బాధ్యత బాధ్యతలు తాము తీసుకోవాలా వద్దా అనే విషయంలో ఆయా నియోజకవర్గ నేతలు ఆలోచనలో పడ్డారు.
తమ నియోజకవర్గంలో సంజయ్ పాదయాత్ర నిర్వహించే సమయంలో తమ పేరును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఫర్వాలేదని, లేకపోతే పాదయాత్రను లీడ్ చేసినా తమకు కలిగే ప్రయోజనం ఏముంటుందనే అభిప్రాయంలో చాలామంది టికెట్ ఆశిస్తున్న నేతలు అభిప్రాయపడుతున్నారు.ఇక మరికొంతమంది నేతలు అయితే మరో రకమైన ఆలోచన తో ఉన్నారట.
సంజయ్ పాదయాత్ర సందర్భంగా భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి, పాదయాత్రలో యాక్టివ్ రోల్ పోషిస్తే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి ఆగ్రహం కలుగుతుందేమో అన్న సందేహము కొంతమంది నేతల్లో వ్యక్తమవుతోందట.

తెలంగాణ బీజేపీ లో కిషన్ రెడ్డి, సంజయ్ రెండు వర్గాలుగా ఉన్నారనే విషయం బహిరంగ రహస్యం కావడంతో, సొంత పార్టీ నేతలే ఈ వ్యవహారంలో సతమతం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.యాక్టివ్ గా లేకపోతే సంజయ్ ఆగ్రహానికి గురి కావాలని, యాక్టివ్ గా ఉంటే కిషన్ రెడ్డి కి ఆగ్రహం కలుగుతుందని, తమ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిందనే అభిప్రాయంలో బీజేపీ నేతలు ఈ పాదయాత్ర వ్యవహారంపై టెన్షన్ పడుతున్నట్టు గా కనిపిస్తున్నారు.