వ్యాక్సిన్ తీసుకున్నా, మాస్క్‌లు పెట్టుకున్నా.. మా క్యాబ్‌లలోకి నో ఎంట్రీ : అమెరికాలో టీకా వ్యతిరేక ఉద్యమం

కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.దీంతో అన్ని దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఉద్ధృతంగా నిర్వహిస్తున్నాయి.

 Taxi Company Rejecting Passengers Who Vaccinated And Masked In America , Joe Bi-TeluguStop.com

ప్రజలు స్వచ్ఛందంగానే వ్యాక్సిన్ వేయించుకుని ప్రభుత్వానికి సహకరిస్తున్నారు.అయితే అమెరికాలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది.

ఇక్కడ టీకాకు వ్యతిరేకంగా ఒక వర్గం, అనుకూలంగా మరో వర్గం అన్నట్లుగా ప్రజలు చీలిపోయారు.

మరోవైపు అమెరికాను కరోనా నుంచి రక్షించడానికి అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కారమన్న ఆయన.ప్రజలంతా టీకాలు వేయించుకోవాలని కోరుతున్నారు.అయినప్పటికీ జనం వ్యాక్సిన్ తీసుకోవడానికి జంకుతున్నారు.సోషల్ మీడియాలో వ్యాక్సిన్ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతుండటం వల్లే ఈ పరిస్ధితి ఎదురవుతోంది.ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు సామాజిక మాధ్యమాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.సామాజిక మాధ్యమాలు అన్యాయంగా ప్రజలను చంపేస్తున్నాయని బైడెన్ ఇటీవల వ్యాఖ్యానించారు.

ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.అంతేగాక వ్యాక్సిన్ వేసుకోనివారిలోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటోందని గుర్తు చేశారు.

కనుక సాధ్యమైనంత త్వరగా టీకాలు తీసుకోవడం మంచిదని బైడెన్ దేశ ప్రజలకు సూచించారు.

ఇప్పుడు సోషల్ మీడియాకు తోడు కొన్ని సంస్థలు టీకాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి.

వివిధ కారణాలతో వ్యాక్సిన్‌ వేసుకోవడానికి కొందరు అమెరికన్లు నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే.ఇలాంటివారికి ఓ రెస్టారెంట్‌ ఇటీవల మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.

వ్యాక్సిన్‌ వేసుకోని వారికి, మాస్క్‌లు ధరించని వారికి మాత్రమే తమ రెస్టారెంట్లోకి అనుమతి వుంటుందని ప్రకటించింది.తాజాగా ముస్సోరీలోని సెయింట్‌ లూయిస్‌ ప్రాంతంలోని ‘యో’ ట్యాక్సీ కంపెనీ కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది.

టీకా వేసుకోకుండా , మాస్క్‌ ధరించని ప్యాసింజర్లను మాత్రమే ఎక్కించుకుంటామని వెల్లడించింది.

తమ సంస్థ వ్యాక్సినేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆ సంస్థ అధినేత చార్లీ బెల్లింగ్టన్‌ బహిరంగ ప్రకటన చేశారు.

తమ ప్యాసింజర్లు వ్యాక్సిన్‌ వేసుకున్నారా లేదా అని ముందుగానే పరిశీలిస్తామని.మాస్క్‌ ధరించకపోతేనే ట్యాక్సీ ఎక్కనిస్తామని చెప్పారు.యూఎస్‌ఏలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వెనుకబడి ఉన్న టాప్‌ 3 రాష్ట్రాల్లో ముస్సోరీ ఒకటిగా నిలిచిన్నందుకు గర్వంగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu America, Cnn Jeff Zucker, Corona, Joe Biden, Taxicompany, Vaccine, Yo Tax

అయితే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రం సీరియస్‌గా తీసుకున్నాయి.ఈ నేపథ్యంలో రెండు డోసుల టీకా తీసుకోకుండా ఆఫీసుకు వ‌స్తున్న ముగ్గురు ఉద్యోగుల‌పై ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ సీఎన్ఎన్ వేటు వేసింది.సీఎన్ఎన్ చీఫ్ జెఫ్ జుక‌ర్ ఈ విష‌యాన్ని ఓ మెమో ద్వారా తోటి ఉద్యోగుల‌కు తెలియ‌జేశారు.

ఆఫీసుకు రావాలంటే క‌చ్చితంగా వ్యాక్సిన్ వేసుకుని ఉండాల‌ని ఆయ‌న ఆ మెమోలో స్ప‌ష్టం చేశారు.ఫీల్డ్ రిపోర్టింగ్‌కు వెళ్లే వాళ్లు కూడా వ్యాక్సిన్ తీసుకుని ఉండాల‌ని, ఎందుకంటే వాళ్లు బహిరంగ ప్రదేశాల్లో మ‌రొక‌రితో ట‌చ్‌లోకి వ‌స్తుంటార‌ని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube