మన దేశంలో పెళ్లి అంటే పవిత్రంగా భావిస్తాము.పెళ్లి అంటేనే చెప్పలేని అనుభూతి.
అలాంటి పెళ్లి ఇద్దరి మనుషులను మాత్రమే కాదు.రెండు కుటుంబాలను కలుపుతుంది.
అలాగే ఈ మధ్య పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.పెళ్ళిలో జరిగే చిన్న చిన్న విషయాలు వీడియోల రూపంలో బయటకు రావడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.
తాజాగా మరొక పెళ్ళికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో అది కాస్త నెట్టింట వైరల్ అయ్యింది.అయితే అన్ని వీడియోలలాగా ఈ వీడియో అలా లేదు.
ఇది కాస్త డిఫరెంట్ గా ఉంది.అప్పుడు పెళ్ళిలో జరిగే ఎదో సంఘటన బయటకు వస్తే అది వైరల్ అవుతుంది.
కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి కూతురు పెళ్లి కోసం పెళ్లి కొడుకును స్వయంగా రెడీ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది.
మాములుగా అయితే వధూవరులను తమ బంధువులు కానీ స్నేహితులు కానీ అదీ కాదంటే ఈ మధ్య కాలంలో బ్యూటీషియన్లు కానీ రెడీ చేస్తుండడం మనం చూస్తుంటాం.కానీ వధువే స్వయంగా వరుడిని రెడీ చేసే వీడియో ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది.ఈ వీడియోలో వధువు వరుడిని మేకప్ వేసి రెడీ చేసింది.
అంతేకాదు పెళ్లి బట్టలు కూడా దగ్గరుండి వేయించింది.
ఈ వీడియో నెటిజెన్స్ ను బాగా ఆకట్టుకుంది.కాస్త కొత్తగా భిన్నంగా ఉండడంతో నెటిజెన్స్ ఈ వీడియోను బాగా వైరల్ చేసేసారు.వధువు వరుడిని రెడీ చేయడానికి అసలు కారణం వాళ్ళ పెళ్లి వేడుకలను నిర్వహించే వెడ్డింగ్ సంస్థ.
వీరు కొత్తగా పెళ్లి చేసుకునే జంట మధ్య అన్యోన్యత పెరగాలని ఇలా కొత్తగా ట్రై చేసారు.ఇది నెటిజెన్స్ కు బాగా నచ్చడంతో అందరు వీరిని ప్రశంసిస్తున్నారు.
వధువు వరుడిని ఎలా రెడీ చేసిందో మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి.