ఇతరులకు సహాయం చేసే విషయంలో రియల్ హీరో సోనూసూద్ ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.సోనూసూద్ పేరును అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు.
తెరపై పాత్రలతో సోనూసూద్ భయపెట్టినా నిజ జీవితంలో మాత్రం అందరికీ సహాయం చేస్తూ సోనూసూద్ సేవాగుణాన్ని చాటుకున్నారు.నేడు సోనూసూద్ పుట్టినరోజు.
పంజాబ్ రాష్ట్రంలోని మోగా అనే ప్రాంతంలో సోనూసూద్ జన్మించారు.,/br>
సోనూసూద్ తల్లి ప్రొఫెసర్ కాగా తండ్రి బట్టల వ్యాపారం చేసేవారు.
వీరి దుకాణం ముందు వారానికి ఒకసారి అన్నదాన కార్యక్రమం జరిగేది.ఆ సమయంలోనే ఇతరులకు సాయం చేయడంలో పొందే ఆనందం గురించి సోనూసూద్ తెలుసుకున్నాడు.
కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తే మాత్రమే రియల్ గా సక్సెస్ సాధించినట్టు అవుతుందని సోనూసూద్ అమ్మ చెప్పగా ఆ మాటలతో సోనూసూద్ స్పూర్తి పొందారు.
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో సోనూసూద్ ఆకలితో అలమటిస్తున్న ఎంతోమంది ఆకలిని తీర్చారు.ఎనిమిది లక్షల మందిని సొంత ఖర్చులతో సోనూసూద్ సొంత ప్రాంతాలకు చేర్చారు.చదువు, జాబ్, హెల్త్ విషయంలో సాయం అడిగిన వారికి నో చెప్పకుండా సోనూ మానవత్వాన్ని చాటుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ ప్రముఖులు చేయలేని పనులను సోనూసూద్ చేయడం గమనార్హం.
సోనూసూద్ ను స్పూర్తిగా తీసుకుని తమ పిల్లలకు సోనూసూద్ అనే పేరు పెట్టుకున్న వాళ్లు పదుల సంఖ్యలో ఉన్నారు.ఈ మధ్య కాలంలో చిన్నచిన్న దుకాణాలకు వెళుతూ సోనూసూద్ అక్కడ ఉండేవాళ్లను సర్ప్రైజ్ చేస్తున్నారు.ఏ మాత్రం కల్మషం లేని వ్యక్తిగా సోనూసూద్ పేరు తెచ్చుకోవడం గమనార్హం.
నటుడిగా ఉత్తమ విలన్ గా పేరు తెచ్చుకున్న సోనూసూద్ రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో అనిపించుకుంటూ ఉన్నారు.గతంలో ప్రముఖ మ్యాగజైన్ స్టార్ డస్ట్ సోనూసూద్ ఫోటోలను రిజెక్ట్ చేయగా తాజాగా అదే మ్యాగజైన్ సోనూసూద్ ను ప్రశంసిస్తూ వ్యాసం రాయడం గమనార్హం.