సాధారణంగా బ్రెష్ చేసుకున్నా కొందరి దంతాలు పసుపు పచ్చగా, గారపట్టేసి ఉంటాయి.దాంతో నాలుగురితో మాట్లాడాలన్నా, స్వచ్ఛగా నవ్వాలన్నా.
తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటారు.ఈ క్రమంలోనే దంతాలను తెల్లగా మార్చుకునేందుకు రకరకాల టూత్ పేస్ట్‌లు వాడుతుంటారు.
అయినప్పటికీ ఫలితం లేకుండా తీవ్ర నిరాశ చెందుతుంటారు.అయితే ఎలాంటి చింతా చెందకుండా ఇంట్లో ఉండే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలతోనే దంతాలను తళతళా మెరిపించుకోవచ్చు.
ముఖ్యంగా దంతాలను తెల్లగా మెరిపించడంలో ఆవనూనె అద్భుతంగా సహాయపడుతుంది.ముందుగా ఒక బౌల్ తీసుకుని.
అందులో కొద్దిగా ఆవనూనె మరియు సాల్ట్ వేసుకుని కలుపు కోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుని.
దంతాలపై అప్లై చేసి బాగా రుద్దు కోవాలి.రెండు నుంచి మూడు నిమిషాల పాటు రుద్దుకుని.
ఆ తర్వాత నీటితో నోటికి క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు ఒక సారి చేస్తే.
దంతాలు తళ తళా మెరుస్తాయి.మరియు చిగుళ్లు కూడా దృఢంగా మారతాయి.
అలాగే ఉసిరి తోనూ దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు.ఎండ బెట్టుకున్న ఉసిరికాయ పొడిలో టమాటా రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో పళ్లకు పూసి కాసేపు రుద్దుకోవాలి.ఆ తర్వాత నోటిని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.ఇలా రెగ్యులర్‌గా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
ఇక తులసి ఆకులను తీసుకుని ఎండ బెట్టి పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిలో చిటికెడు పసుపు మరియు నీళ్లు పోసి కలిపు కోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమంతో దంతాలను రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకుని.
గోరు వెచ్చని నీటితో నోటిని శుభ్రపరుచుకోవాలి.రోజుకు ఒక సారి ఇలా చేస్తే.
దంతాలు మిలమిలా మెరుస్తాయి.మరియు చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ల పొటు వంటి సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి.