రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం రోజు రోజుకి ఉధృతంగా మారుతోంది.ఇప్పటికే ఈ పంచాయతీ కేంద్ర పెద్దల దగ్గరికి వెళ్లడంతో బోర్డు.
ఎటువంటి ఆదేశాలు ఇస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించాలని సూచించారు.ఇటువంటి తరుణంలో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తాజాగా జల జగడం పై స్పందించారు.
ఈ క్రమంలో సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రెండు తెలుగు రాష్ట్రాల నీటి సమస్య విషయంలో తోటి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తో కూర్చుని చర్చించి పరిష్కరించుకోవాలని వైయస్ జగన్ కి సూచించారు.
తాజాగా ఇటీవల సోషల్ మీడియాలో.ఈ జల వివాదంపై సీఎం జగన్ కి సూచిస్తూ కామెంట్లు చేయడం జరిగింది.” వైఎస్ జగన్ గారూ ఇప్పటికైనా కేసీఆర్ దగ్గరికెళ్లి సమస్యను సామరస్యంగా పరిష్కరించండి.కృష్ణా డెల్టాకు 70 టీఎంసీల గోదావరి నీళ్లు అందుబాటులోకి వచ్చిన క్రమంలో ఆ మేర రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం నుంచి నికర జలాలు కేటాయిస్తూ జీఓ ఇవ్వండి” అని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు.