జనసేన విషయంలో బిజెపి ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నాలు ఉంది.ప్రస్తుతం బిజెపి జనసేన పరిస్థితి ఏపీలో అంతంతమాత్రంగానే ఉంది.
అలాగే ప్రధాన ప్రతిపక్షం టిడిపి గతంతో పోలిస్తే బలహీనపడడంతో ఆ ప్లేస్ కోసం బిజెపి ,జనసేన పార్టీలు కలిసి పోరాటం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి.జనసేన ను కలుపుతూ వెళ్ళే విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అంత సుముఖంగా లేరు.
అదే నివేదికలతో ఆయనను మార్చేందుకూ బిజెపి సిద్ధమవుతోంది అనే వార్తలు ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తున్నాయి.అయితే బిజెపి మాత్రం ఏదో రకంగా పవన్ పై ఒత్తిడి పెంచి, జనసేన ను బీజేపీ లో విలీనం చేసే దిశగా అడుగులు వేయించాలని చూస్తోంది.
ఎప్పటి నుంచో ఈ ప్రతిపాదన పెడుతున్నా పవన్ మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
గతంలో తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్ లో విలీనం చేయడం పై ఎన్నో విమర్శలు వచ్చాయి.
అప్పట్లో ఈ విభజన ప్రక్రియను పవన్ కూడా తప్పు పట్టారు.అయితే ఇప్పుడు అదే పరిస్థితి తనకు ఎదురవుతుండడంతో పవన్ గతాన్ని తలుచుకుంటున్నారు.బీజేపీ నుంచి విలీన ప్రక్రియ విషయంలో ఒత్తిడి వస్తోంది.అయితే ఇటీవల మంగళగిరిలో జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడిన పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ పార్టీని నడపడం చాలా కష్టమైన పని అంటూ ఆయన మాట్లాడడంతో అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

ఒకవైపు పార్టీని మరోవైపు సినిమాలను బ్యాలెన్స్ చేయలేక పవన్ ఇబ్బందులు పడుతున్నారని, అలాగే పార్టీని ముందుకు నడిపించేందుకు, ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం ఇబ్బందికరంగా ఉండడం, ఇలా ఎన్నో అంశాలు ఆలోచనలో మార్పు తీసుకొస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి.అయితే పవన్ జనసేన ను బిజెపిలో విలీనం చేసే విషయంలో తర్జనభర్జన పడుతున్నారని, అందుకే ఇంతగా టెన్షన్ పడుతున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.అయితే పవన్ జనసేన ను బీజేపీ లో విలీనం చేస్తే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంతోపాటు, కేంద్రమంత్రిగా అవకాశం కల్పించే ఆలోచనతో బీజేపీ ఉందట.