కరోనా థర్డ్ వే వచ్చేస్తుంది.దీని బారిన పడకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలతో పాటు ప్రతి ఒక్కరూ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి.
మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.మరి ఆ ఆహార పదార్థాలేంటి? వాడు ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
వెల్లుల్లి :
కొందరు కూరలో పచ్చడిలో వేసి వెల్లుల్లి రెబ్బలు తినరు.ఇలా చేస్తే ఆరోగ్యాన్ని వదిలేసినట్టే.
వెల్లుల్లి అనేక యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.అంతే కాదు జీర్ణాశయంలో ఏర్పడే పుండ్లు, క్యాన్సర్లకు కారణమయ్యే కణాలను సమర్థవంతంగా ఎదుర్కొంటుది.
పుచ్చకాయ: ఎర్రగా నల్లని విత్తనాలతో చూడగానే నోరూరించే పచ్చికాయలో గ్లూటాథియోన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి.ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను, జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది.
స్వీట్ పొటాటో :
చిలకడదుంప, గెనిస గడ్డ, రత్నపురి గడ్డగా పిలిచే దీంట్లో బీటా కెరోటిన్లు బాగా ఉంటాయి.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కణాల నుంచి ఎదురయ్యే అనర్ధాలను తొలగిస్తాయి.
అన్నిటికంటే ముఖ్యంగా వృద్యాప్య ఛాయలను తగ్గించే విటమిన్ ‘ఎ’ దండిగా ఉంటుంది.
పెరుగు : కాస్త జలుబు చేసినట్లు అనిపిస్తే చాలు పెరుగు ను దూరం పెట్టేస్తారు.రోజు కప్పు పెరుగు తింటే తరచూ జలుబు బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.జబ్బులతో పోరాడేందుకు రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుందిని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది.ఇందులో విటమిన్ ‘డి’ ఉంటుంది.ఇది జలుబు, ఫ్లూ వంటి సమస్యను నివారిస్తుంది.
పాలకూర : ఇందులో ఫొలిట్ దండిగా ఉంటుంది.పాలకూరలో పీచుపదార్థాలు సమృద్ధిగా లభిస్తుంది.అంతేకాకుండా విటమిన్ ‘సి’ యాంటి ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి.ఇది శరీరంలో కొత్త కణాలు ఉత్పత్తిలో పాలుపంచుకుంటుంది.
బాదం :
ఇది వ్యాధినిరోధక శక్తి తగ్గకుండా కాపాడుతుంది. ఒత్తిడిని, ఆందోళన నుంచి బయట పడటానికి సహాయపడుతుంది.
బాదంలో విటమిన్ ‘ఇ’ సమృద్ధిగా లభిస్తుంది.
మాంసాహారం : స్కిన్ చికెన్, చేపలు, గుడ్డులోని తెల్లసొన వంటి వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.వీటిని ఎక్కువగా తీసుకుంటే మంచిది.
ఇవి మాత్రమే కాకుండా సిట్రస్ జాతి పండ్లు, నిమ్మ కాయ, ఆరెంజ్ , కాలిఫ్లవర్, క్యారెట్ పుట్టగొడుగులు, ఉల్లిగడ్డలు, పసుపు వంటి ఆహార పదార్థాలు శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి సహాయపడతాయి.