పెట్రోలియం జెల్ల దాదాపు అందరూ దీనిని స్కిన్‌కి వాడుతుంటారు.ముఖ్యంగా చర్మ పగుళ్లకు దూరంగా ఉండటం కోసం పెట్రోలియం జెల్లీనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
అయితే చర్మంపై పగుళ్లను నివారించడానికే కాదు పెట్రోలియం జెల్లీని అనేక విధాలుగా యూజ్ చేయొచ్చు.అదెలాగో ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా కొందరి పాదాలు చాలా డ్రైగా, కఠినంగా ఉంటాయి.అలాంటి వారు ఒక బౌల్‌లో రెండు స్పూన్ల పెట్రోలియం జెల్లీ తీసుకుని అందులో ఒక స్పూన్ నిమ్మ రసం మరియు రెండు, మూడు చుక్కల గ్లిజరిన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాలకు రుద్ది.గంట తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా రోజుకు ఒక సారి చేస్తే పాదాలు మృదువుగా, కోమలంగా మారిపోతాయి.
అలాగే ఒక్కో సారి నైట్ క్రీమ్ అయిపోతూ ఉంటుంది.
అలాంటిప్పుడు పెట్రోలియం జెల్లీని జెస్ట్ మూడు సెకెండ్లు వేడి చేసి చర్మానికి అప్లై చేసుకోవచ్చు.ఇలా చేస్తే ఉదయానికి స్కిన్ గ్లోగా మరియు స్మూత్‌గా మారుతుంది.
లిప్ స్టిక్ ఎక్కువ సమయం పాటు ఉండాలని అమ్మాయిలు అందరూ కోరుకుంటారు.అయితే అందుకు పెట్రోలియం జెల్లీ గ్రేట్‌గా సహాయపడుతుంది.లిప్ స్టిక్ కు పెట్రోలియం జెల్లీని జత చేసి వేసుకుంటే లిప్ స్టిక్ ఎక్కువగా సమయం పాటు నిలుస్తుంది.</br.
చాలా మంది జుట్టు పొట్లి పోతుందని తెగ బాధ పడుతుంటారు.అలాంటి వారు రెగ్యులర్‌గా జుట్టు చివర్లన పెట్రోలియం జెల్లీని పూస్తే పొట్లి పోవడం తగ్గి ఒత్తుగా పెరగడం స్టార్ట్ అవుతుంది.
అలాగే పెట్రోలియం జెల్లీ మేకప్ రిమూవర్‌గా కూడా పని చేస్తుంది.కాబట్టి, ఇకపై మేకప్‌ను తొలిగించేందుకు రసాయానాలతో కూడిన రిమూవర్స్‌ను బదులుగా పెట్రోలియం జెల్లీని యూజ్ చేయండి.
ఇక అప్పుడప్పుడూ రకరకాల కారణాల వల్ల చర్మం దురద పెడుతూ ఉంటుంది.అయితే దురద పెడుతున్న ప్రాంతంలో పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకోవాలి.ఇలా చేస్తే తక్షణ ఉపశనం పొందుతారు.