టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని.ఈయన పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించిన ఈయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.నటుడిగా కంటే ముందు దర్శకుడిగా అడుగు పెట్టాలనుకున్నాడు.కానీ క్లాప్ అసిస్టెంట్ గా తన కెరీర్ ను ప్రారంభించాడు.అష్ట చమ్మా సినిమాతో తొలిసారిగా నటుడిగా పరిచయం అయ్యాడు నాని.
ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించాడు.ఇక ఈయన నటుడుగా నటించిన తొలి సీన్ గురించి పంచుకున్నాడు.

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని తన వ్యక్తిగత విషయాలను కొన్ని అనుభవాన్ని పంచుకున్నాడు.తాను తొలి సినిమా చేస్తున్న సమయంలో తన మనసులో సవాలక్ష సందేహాలు వచ్చాయని తెలిపాడు.దర్శకుడు అనుకున్నట్టుగానే నటిస్తున్నానా.పాత్రకి న్యాయం చేస్తున్నానా.అనే భయాలు తనలో వెంటాడేవట.చాలామంది నటులు తమ తొలి సినిమా సమయంలో కెమెరా అనేసరికి భయపడుతుంటారని.
కానీ తనకు ఆ సమస్య లేదని తెలిపాడు.
సహాయ దర్శకుడిగా పని చేశాడట, కెమెరా అసిస్టెంట్ లతో, తోటి సహాయ దర్శకులతో కలిసి భోజనాలు చేసేవాడట.
తనకు ఆ వాతావరణం అలవాటుగా మారడంతో ఎప్పుడైనా కెమెరా ముందుకి అంతే ఆత్మవిశ్వాసంతో వెళ్ళాడట.తన తొలి సినిమా అష్టాచమ్మా కోసం ఎటువంటి స్పష్టత లేకుండా తొలి రోజులోనే సెట్ లోకి అడుగు పెట్టాడట.
కాఫీ షాప్ లో స్వాతి ని కలవడానికి వెళ్లే సన్నివేశం కోసం తొలిసారి కెమెరా ముందుకు వెళ్ళాడట.అవసరాల శ్రీనివాస్ కాఫీ షాప్ లో నుంచి స్వాతికి తనతో చూపించడంతో, తను హాయ్ చెబుతూ అక్కడికి వెళ్లే సన్నివేశమదని ఆ షాట్ దాటడమే తన ముందున్న గండం అని తెలిపాడు.

దీని తర్వాత తను ఏం చేయాలని, ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా వస్తుందా.ఇలాంటి ఆలోచనలేవీ లేవట.తొలి నాలుగు సినిమాల వరకూ.ఈ సినిమా ఆడితే ఇంకొక సినిమా వస్తుందేమో అనుకోని చేయడమే తప్ప, ఇంత ఆదరణ, సుదీర్ఘమైన ప్రయాణంను ఊహించుకోలేదని తెలిపాడు.ఇక తనకు ప్రేక్షకులతో ప్రత్యేక అనుబంధం ఏర్పడ్డాకే తనకు ఇక్కడ పూర్తిస్థాయి ప్రయాణం అనే నమ్మకం ఏర్పడిందని.తన తొలి సినిమా ఎలా చేస్తున్నారో తెలియదు కానీ దర్శకుడు మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి మాత్రం బాగుందని మరో షాట్ కి తీసుకువెళ్లేవాడట.
అలా ఆ దర్శకుడి పక్కనుంటే ఏ సందేహాలున్న తొలగిపోతాయని తెలిపాడు.ఆయన 120% ప్రతిభను కనబరిచే విధంగా ప్రోత్సహిస్తారని కానీ తనకు మాత్రం అష్టాచెమ్మా ఎప్పుడూ ప్రత్యేకమే అంటూ తెలిపాడు నాని.