సౌత్ ఇండియా స్టార్ దర్శకుడు శంకర్ చిత్రాలు అంటే సోషల్ ఎలిమెంట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కాగా ఉంటాయి.అలాగే భారీ బడ్జెట్ అతని సినిమాల కోసం ఖర్చు పెడతారు.
శంకర్ ఆలోచనలు ఎప్పుడూ కూడా చాలా ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి.ఎవరూ చేయలేని సన్నివేశాలని కూడా తన సినిమాలలో ఉండే విధంగా చూసుకుంటాడు.
ప్రపంచంలో అత్యంత పురాతనమైన పర్యాటక పర్వత మచ్చుపిచ్చు మీద మొదటి సారి సాంగ్ షూట్ చేసిన ఇండియన్ సినిమాగా రోబోకి ఘనత దక్కుతుంది.ఆ సినిమా సృష్టికర్త శంకర్ అనే విషయం అందరికి తెలిసిందే.
ఇదిలా ఉంటే గతంలో తెలుగులో చిరంజీవితో శంకర్ సినిమా చేయాలని అనుకున్నారు.అయితే అది ఎందుకో వర్క్ అవుట్ కాలేదు.

ఇప్పుడు చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ఏకంగా రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాని నాలుగు నెలల క్రితమే ఎనౌన్స్ చేసేశారు.తరువాత ఇండియన్ 2 వివాదంలో లైకా ప్రొడక్షన్ కోర్టుకి వెళ్ళడంతో ఈ సినిమాకి మధ్యలో కొంత ఆటంకం వచ్చింది.
సినిమా స్టార్ట్ అవుతుందా లేదా అనే డౌట్స్ కూడా వచ్చాయి.అయితే లైకాతో ఉన్న వివాదానికి శంకర్ ముగింపు చెప్పుకొని రామ్ చరణ్ సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు.
ఈ నేపధ్యంలో ఈ మూవీ షూటింగ్ కోసం కూడా రంగం సిద్ధం చేస్తున్నారు.ప్రస్తుతం తెలంగాణ సర్కార్ షూటింగ్ లకి పర్మిషన్ ఇచ్చేసింది.ఈ నేపధ్యంలో శంకర్ రామ్ చరణ్ తో సినిమా షూటింగ్ ఆగష్టు ఫస్ట్ వీక్ లో స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు.దీనికోసం ప్రస్తుతం క్యాస్టింగ్ ని ఫైనల్ చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.