మనిషి తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు.మనిషి మెదడు అనేక రకాల రూపాంతరాలు సాధించి నేడు కొత్త టెక్నాలజీ వైపు పరుగులు పెడుతోంది.
తాజాగా మనిషి మెదడుపై అనేక రకాల పరిశోధనలు సాగుతున్నాయి.మనిషి మెదడును చదివే దానిపై అనేక రకాల ప్రయోగాలను శాస్త్రవేత్తలు చేస్తున్నారు.
తాజాగా అలా పరిశోధనలు చేసిన వారు ఓ గొప్ప విషయాన్ని కనుగొన్నారు.మనిషి మెదడును చదివే ఓ గొప్ప హెల్మెట్ ను తయారు చేశారు.
అమెరికాలోని కెర్నెల్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ మనిషి మెదడును చదివే హెల్మెట్లను రెడీ చేసింది.ఇప్పటి వరకూ మనిషి మెదడుపై అనేక రకాల పరిశోధనలు చేశారు.
వాటిలో అనేక వివరాలు తెలిశాయి.ఇప్పటివరకు మెదడు పనితీరు దాని ప్రభావంపై చేసిన పరిశోధనలు, పరీక్షలన్నీ ఆశాజనక ఫలితాలని ఇచ్చాయి.
రాబోవు వారం రోజుల్లో పలువురు కస్టమర్లుకు కూడా పంపే అవకాశం ఉంది.ఈ మెదడును చదివే హెల్మెట్ల ధరను 50 డాలర్లుగా నిర్ణయించింది.దాదాపు మన కరెన్సీలో సుమారు రూ.3,700గా నిర్ణయించినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.

ఎలక్ట్రానిక్ పరికరాలు, సెన్సార్లు సాయంతో తయారుచేసిన ఈ హెల్మెట్ మనిషి యొక్క రక్త ప్రవాహం, ఆలోచనల వేగం, బయట పరిస్థితులకు స్పందింస్తుంది.శరీరంలోని అవయవాలు తీరును అంచనా వేస్తుంది.వాటి ఆధారంగా ఒక డేటాను అది రెడీ చేస్తుంది.ఈ టెక్నాలజీతో కొన్ని వస్తువులు తయారు చేసిన అవి భారీ పరిమాణంతో పాటు గదికి పరిమితమై ఉండేవిగా ఉన్నాయి.
ఎట్టకేలకు దీనిని ప్రజలకు అందుబాటులోకి తచ్చారు.కెర్నల్ చేసిన పరికరం హెల్మెట్ పరిమాణంలో అదే ఆకారంలో కేవలం రెండు పౌండ్లు మాత్రమే బరువుతో ఉంది.
మనిషి బయటకి వెళ్లేప్పుడు ఆ హెల్మెట్ ను తలకు ధరించి వెళ్లినప్పుడు బయట జరిగే పరిస్థితిలను బట్టి మన మెదడు స్పందనలను అది తెలుపుతుంది.