ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో పారిశ్రామిక రంగాలతో పాటు ఇతర రంగాలు కూడా ఆర్థిక పరంగా తీవ్రంగా నష్టపోయాయి.అయితే ఇందులో సినిమా పరిశ్రమ రంగం ఒకటి.
కాగా లాక్ డౌన్ విధించడంతో సినిమా షూటింగులు, ధారావాహికల షూటింగులు కూడా నిలిపివేశారు.దీంతో కొందరు ఆర్టిస్టులతో పాటు ఇతర టెక్నీషియన్లు కూడా ఉపాధి కోల్పోయి పూట గడవని పరిస్థితులకు చేరుకున్నారు.
దీంతో తాజాగా ఉపాధి కోల్పోయిన ఓ నటుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే సువి చక్రవర్తి అనే ఓ సీరియల్ నటుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబై నగర పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.
అయితే ఇతడు అరకొర అవకాశాలతో సీరియళ్లలో నటిస్తూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు.కానీ గత కొద్ది కాలంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో ధారావాహికల షూటింగులను నిలిపివేశారు.
దీంతో ఉపాధి కోల్పోయి ఆర్థిక పరమైన సమస్యలతో బాగా ఇబ్బంది పడుతుతున్నాడు.ఈ క్రమంలో తన తండ్రి సంపాదనపై ఆధారపడ్డాడు.కొంతమేర మానసికంగా కూడా పలు రుగ్మతలతో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.దీంతో తాజాగా ఫేస్ బుక్ ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించి తాను ఎదుర్కొన్న కష్టాల గురించి మాట్లాడుతూ నుండి నిద్ర మాత్రలు మింగినాడు.
అంతేకాకుండా “ఐ క్విట్” అంటూ పోస్టును కూడా షేర్ చేశాడు.దీంతో ఇది గమనించిన ఓ వ్యక్తి వెంటనే ఈ విషయాన్ని దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు చేరవేశాడు.దాంతో పోలీసులు సువి చక్రవర్తి ఉన్నటువంటి లొకేషన్ ని కనుగొని వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.అయితే తాను ఆత్మహత్య ప్రయత్నం చేసినప్పుడు తన గదిలో తలుపులు మూసి ఉండడంతో కుటుంబ సభ్యులు గమనించలేకపోయారు.
కాగా ప్రస్తుతం సువి చక్రవర్తి కి పలువురు సైకియార్టిస్టులతో పాటూ ఇతర వైద్యులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.