మెక్ డొనాల్డ్ చికెన్ పేరు తెలియని ఫుడ్ లవర్ ఉండరనేది అతిషయోక్తి కాదు.ఒకప్పుడు చిన్న సంస్థగా ప్రారంభమైన మెక్ డొనాల్డ్స్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరించుకుంది.
ఇక కస్టమర్ లను ఆకట్టుకోవడంలో మెక్ డోనాల్డ్స్ సక్సెస్ అయినట్టుగా ఏ ఇతర సంస్థ కూడా సక్సెస్ కాలేదని చెప్పవచ్చు.మార్కెట్ లో ఏదైనా వస్తువు అత్యంత ప్రాచుర్యం పొందడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు.
ఇక అది ఆటోమేటిక్ గా ఒక బ్రాండ్ అనేదానిని ఏర్పరుచుకుంటుంది.ఇక అది చిన్న చిన్న వ్యాపార సముదాయాలను కూడా మింగేస్తుంది.
అప్పటి వరకు మార్కెట్ లో ఎంతో కొంత సత్తా చాటిన చిన్న చిన్న కంపెనీలు సైతం పెద్ద సంస్థ దెబ్బకు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి.అయితే చాలా మట్టుకు మెక్ డొనాల్డ్ అత్యంత పాపులర్
కాబట్టి మెక్ డొనాల్డ్స్ కు సంబంధించిన ప్రతి వార్త నెట్టింట వైరల్ గా మారుతుందనే విషయం మనకు తెలిసిందే.
ఇప్పడు మెక్ డొనాల్డ్స్ కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.అమాంగ్ అస్ వీడియో గేమ్ లోని సుస్ అనే పాపులర్ పాత్రను పోలిన చికెన్ నగ్గెట్ ను రూపొందించారు.
దానికి వేలం నిర్వహించగా అక్షరాల 72 లక్షలకు అమ్ముడు పోయింది.