యముడికి తెలుగు సినిమా పరిశ్రమకు విడదీయలేని సంబంధం ఉంది.యముడి కాన్సెప్టుతో వచ్చి చాలా సినిమాలు మంచి విజయాన్ని సంపాదించాయి.
బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్లు కొట్టాయి.తెలుగు బెస్ట్ కాన్సెప్టుగా యముడి సినిమాలు నిలిచిపోయాయి.
ఇంతకీ యముడి కాన్సెప్టుతో వచ్చి విజయం సాధించిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.దేవాంతకుడు తెలుగులో యముడి కాన్సెప్టుతో వచ్చిన తొలి సినిమా ఇది.1960లో వచ్చిన ఈ సినిమాలో ఎస్వీఆర్ యముడిగా.ఎన్టీఆర్ నరుడిగా నటించి మెప్పించారు.
ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది.యమగోల
ఈ సినిమా కూడా ఎన్టీఆర్ నటించినదే. 1977లో ఈ యమగోల సినిమా విడుదల అయ్యింది.ఇందులో యముడి పాత్ర చేసి చక్కటి పేరు సంపాదించుకున్నాడు కైకాల సత్యనారాయణ.
ఈ మూవీ కూడా చక్కటి విజయం సాధించింది.యముడికి మొగుడు1988లో ఈ సినిమాను చిరంజీవి చేశాడు.
యమలోకంలో చిరంజీవి చేసిన డ్యాన్సులు, నటన జనాలను బాగా ఆకట్టుకున్నాయి.ఇందులో కూడా యముడి క్యారెక్టర్ సత్యనారాయణ చేయడం విశేషం.
యముడన్నకి మొగుడుఈ సినిమాలో సుమన్ హీరోగా చేశాడు.1992లో వచ్చిన ఈ సినిమాలో యముడి పాత్రలో కోట శ్రీనివాసరావు నటించాడు.యమలీల
అలీ హీరోగా 1994లో ఎస్ వి కృష్ణారెడ్డి తీసిన సినిమా యమలీల.చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయం సాధించింది.ఇందులో సైతం యముడి పాత్రలో సత్యనారాయణ నటించాడు.యమజాతకుడు
మోహన్ బాబు హీరోగా చేసిన ఈ సినిమా 1999లో జనాల ముందుకు వచ్చింది.మంచి విజయాన్ని అందుకుంది.
యమగోల మళ్ళీ మొదలైంది 2007లో వచ్చిన ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అయ్యింది.ఇందులో కూడా కైకాల యముడి క్యారెక్టర్ చేశాడు.
యమదొంగ
రాజమౌళి- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో 2007లో ఈ సినిమా విడుదల అయ్యింది.ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.ఇందులో యుముడిగా మోమన్ బాబు చేశాడు.దరువురవితేజ 2012లో చేసిన దరువు సినిమా కూడా మంచి విజయం సాధించింది.యముడికి మొగుడుఅల్లరి నరేష్ హీరోగా 2012లో చేసిన సినిమ యముడికి మొగుడు.
ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.