తెలుగులో వచ్చిన హిట్ సినిమాలను రీమేక్ చేయడంలో ముందుంటున్నారు బాలీవుడ్ జనాలు.సినిమా హిట్ టాక్ వస్తే చాలు రీమేక్ రైట్స్ కోసం బీటౌన్ దర్శక నిర్మాతలు ఎగబడుతున్నారు.అక్కడి హీరోలను పెట్టి రీమేక్ చేస్తున్నారు.అయితే రీమేక్ ని సరిగ్గా హ్యాండిల్ చేస్తేనే హిట్ అవుతాయి.లేదంటే ఫట్ అవుతాయి.అందుకే తెలుగులో సినిమాలు చేసిన దర్శకులతోనే బాలీవుడ్ లో రీమేక్ చేయిస్తున్నారు నిర్మాతలు.అలా తెలుగు డైరెక్టర్లు చేస్తున్న బాలీవుడ్ రీమేక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
సందీప్ వంగ- అర్జున్ రెడ్డి-కబీర్ సింగ్
విజయ్ దేవరకొండను హీరోగా పెట్టి సందీప్ వంగ తీసిన అర్జున్ రెడ్డి మంచి హిట్ కొట్టింది.ఈ సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ అయ్యింది.
లారెన్స్-కాంచన- లక్ష్మీ బాంబ్
రాఘవ లారెన్స్ తెలుగులో చేసిన కాంచన సినిమాను బాలీవుడ్ లో లక్ష్మీబాంబ్ పేరుతో రీమేక్ చేశారు.
సుధా కొంగర-ఇరుది సత్తురు-సాలా ఖాదూస్
మాధవన్ తో తమిళంలో ఇరుది సత్తురు తీసిని దర్శకురాలు సుధా కొంగర.ఇదే సినిమాను హిందీలో సాలా ఖాదూస్ పేరుతో తీసి డబుల్ హిట్ కొట్టింది.
శైలేష్ కొలను- HIT – HIT
తొలి సినిమాతోనే హిట్ కొట్టిన శైలేష్.హిట్ మూవీని అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశాడు.ఇందులో రాజ్ కుమార్ రావు హీరోగా నటించాడు.
గౌతం తివారి- జెర్సీ-జెర్సీత
తెలుగులో నానితో తీసిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.ఇదే సినిమాను షాహిద్ ను హీరోగా పెట్టి బాలీవుడ్ లో రీమేక్ చేశారు.
అశోక్-భాగమతి-దుర్గామతి
అనుష్క కీరోల్ చేసిన తెలుగు మూవీ భాగమతి.ఈ సినిమాను హిందీలో దుర్గామతి పేరుతో అశోక్ రీమేక్ చేశాడు.బట్ అంత సక్సెస్ కాలేదు.
మురుగ దాస్-తుపాకి-హాలీడే
తమిళంలో విజయ్ తో తీసిన తుపాకి సినిమాను బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ ను హీరోగా పెట్టి హాలీడే పేరుతో తీశాడు మురుగదాస్.ఈ సినిమా మంచి విజయం సాధించింది.