శాకుంతలం కోసం ఆ పని చేస్తున్న గుణశేఖర్..?

తెలుగు సినీ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే.ఆయన తీసుకునే కథలు సరికొత్త గా ఉండటమే కాకుండా బాగా ఆకట్టుకుంటాయి.

 Director Gunasekhar Special Focus On Shaakuntalam Vfx Graphics , Guna Shekar, H-TeluguStop.com

ఎక్కువగా చారిత్రక, పౌరాణిక సినిమాలకు దర్శకత్వం వహిస్తాడు.వాటిని చిత్రించడంలో కూడా ఓ స్థాయితో ఆసక్తి చూపిస్తాడు.

ఇక ఆయన అనుష్కతో రుద్రమదేవి సినిమా చేసిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఆయన దర్శకత్వంలో బాల రామాయణం కూడా పౌరాణిక నేపథ్యంలోని తెరకెక్కింది.

అంతేకాకుండా హీరో రానా తో కలిసి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ‘హిరణ్యకశిప‘ సినిమాను అనుకోగా అది కాస్తా సమయం పడుతుందని తెలిపాడు.ఇక ఈ సినిమాకంటే ముందే టాలీవుడ్ బ్యూటీ సమంతతో శాకుంతలం సినిమాను పరిచయం చేశాడు.

ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కనుంది.ఇక ఇది మహాభారతంలోని ఆది పర్వం నుంచి తీసుకున్నారు.

ఇందులో శకుంతల పాత్రలో సమంత నటిస్తుంది.దుష్యంతుడి గా మలయాళ హీరో దేవ్ మోహన్ కనిపించనున్నాడు.

Telugu Aditi Balan, Dil Raju, Gunasekhar, Eesha Rebba, Guna Shekar, Dev Mohan, N

ఇందులో శకుంతల ప్రాణ సఖులు గా.ఈషా రెబ్బ, తమిళ నటి అదితి బాలన్ లు కనిపించనున్నారు.ఇదిలా ఉంటే డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమా లో విఎఫ్ఎక్స్ కోసం తగ్గడం లేదని తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమా కోసం 35 కోట్లకు పైగా ఖర్చు చేసాడంట.

ఎక్కువ శాతం విజువల్ ఎఫెక్ట్స్ ల కోసమే ఖర్చు అవుతుందని అన్నారట.బడ్జెట్ ఎక్కువైనా సరే వర్క్ చేయిస్తున్నాడట.

ఇక డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం తో మంచి నమ్మకం ఉన్నందున దిల్ రాజు కూడా ఈ సినిమాకు ఓ భాగస్వామిగా చేరాడు.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందు రానుందని సినీ బృందం తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube