శాకుంతలం కోసం ఆ పని చేస్తున్న గుణశేఖర్..?
TeluguStop.com
తెలుగు సినీ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే.ఆయన తీసుకునే కథలు సరికొత్త గా ఉండటమే కాకుండా బాగా ఆకట్టుకుంటాయి.
ఎక్కువగా చారిత్రక, పౌరాణిక సినిమాలకు దర్శకత్వం వహిస్తాడు.వాటిని చిత్రించడంలో కూడా ఓ స్థాయితో ఆసక్తి చూపిస్తాడు.
ఇక ఆయన అనుష్కతో రుద్రమదేవి సినిమా చేసిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఆయన దర్శకత్వంలో బాల రామాయణం కూడా పౌరాణిక నేపథ్యంలోని తెరకెక్కింది.
అంతేకాకుండా హీరో రానా తో కలిసి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా 'హిరణ్యకశిప' సినిమాను అనుకోగా అది కాస్తా సమయం పడుతుందని తెలిపాడు.
ఇక ఈ సినిమాకంటే ముందే టాలీవుడ్ బ్యూటీ సమంతతో శాకుంతలం సినిమాను పరిచయం చేశాడు.
ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కనుంది.ఇక ఇది మహాభారతంలోని ఆది పర్వం నుంచి తీసుకున్నారు.
ఇందులో శకుంతల పాత్రలో సమంత నటిస్తుంది.దుష్యంతుడి గా మలయాళ హీరో దేవ్ మోహన్ కనిపించనున్నాడు.
"""/"/
ఇందులో శకుంతల ప్రాణ సఖులు గా.ఈషా రెబ్బ, తమిళ నటి అదితి బాలన్ లు కనిపించనున్నారు.
ఇదిలా ఉంటే డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమా లో విఎఫ్ఎక్స్ కోసం తగ్గడం లేదని తెలుస్తుంది.
ఇప్పటికే ఈ సినిమా కోసం 35 కోట్లకు పైగా ఖర్చు చేసాడంట.ఎక్కువ శాతం విజువల్ ఎఫెక్ట్స్ ల కోసమే ఖర్చు అవుతుందని అన్నారట.
బడ్జెట్ ఎక్కువైనా సరే వర్క్ చేయిస్తున్నాడట.ఇక డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వం తో మంచి నమ్మకం ఉన్నందున దిల్ రాజు కూడా ఈ సినిమాకు ఓ భాగస్వామిగా చేరాడు.
ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందు రానుందని సినీ బృందం తెలిపారు.
199 సినిమాలు రిలీజ్.. 26 మాత్రమే హిట్.. 2024 సంవత్సరం సక్సెస్ పర్సెంటేజ్ ఇదే!