బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఫిట్ నెస్ ను కాపాడుకోవడంతో పాటు కుర్ర హీరోలకు పోటీనిస్తున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ హీరో రాధే సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమా థియేటర్లతో పాటు పే పర్ వ్యూ పద్దతిలో ఓటీటీలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.అయితే ఇప్పటికే విడుదలైన రాధే ట్రైలర్ లో సల్మాన్ ఖాన్ హీరోయిన్ కు లిప్ లాక్ ఇచ్చారు.
తొలి సినిమా నుంచి సల్మాన్ ఖాన్ లిప్ లాక్ సన్నివేశాలకు దూరంగా ఉన్నారు.
ఈ సినిమాలో దిశా పటానీతో లిప్ లాక్ సన్నివేశం ఉండగా ఈ సన్నివేశం గురించి జోరుగా చర్చ జరుగుతోంది.
దిశాపటానీతో సల్మాన్ లిప్ లాక్ పై కొందరు నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తుంటే కొందరు నెటిజన్లు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.అయితే లిప్ లాక్ వివాదం గురించి సల్మాన్ ఖాన్ స్పందించి స్పష్టతనిచ్చారు.
రాధే సినిమాలో దిశాపటానీ అద్భుతంగా నటించిందని సల్మాన్ అన్నారు.దిశాపటానీ బ్యూటిఫుల్ గా ఉందని సల్మాన్ పేర్కొన్నారు.

సినిమాలో ఇద్దరం ఒకే ఏజ్ గ్రూప్ లా కనిపించామని అయితే తనతో లిప్ లాక్ సన్నివేశంలో తాను నటించలేదని సల్మాన్ అన్నారు.తెరపై ఆ విధంగా కనిపించినా తాను తాను దిశాపటానీకి ముదు పెట్టలేదని సల్మాన్ పేర్కొన్నారు.సినిమాలో లిప్ లాక్ సీన్ ఎంతో ముఖ్యం కావడంతో ఆ సన్నివేశాన్ని సినిమాల్లో ఉంచామని సల్మాన్ పేర్కొన్నారు.మరోవైపు డీజే సినిమాలో హిట్టైన సీటీమార్ పాటను సల్మాన్ ఖాన్ ఈ సినిమా కోసం ఉపయోగించుకున్న సంగతి తెలిసిందే.
రాధే సినిమాలో సల్మాన్ ఖాన్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటిస్తున్నారు.ఇప్పటికే వరుస సక్సెస్ లతో జోరుమీదున్న సల్మాన్ ఈ సినిమాతో మరో సక్సెస్ సాధిస్తానని భావిస్తున్నారు.
ఈ నెల 13న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.