మంత్రులకు పదవీ గండం ? కీలక నిర్ణయం దిశగా కేసీఆర్ ? 

ఎప్పుడు విజయంపైనే తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి పెడుతుంటారు.ఓటమిని, వెనకబాటు తనాన్ని ఏ మాత్రం ఆయన అంగీకరించారు.

 Kcr Going To Make Changes In The Cabinet Soon , Kcr, Telangana, Trs, Bjp, Congre-TeluguStop.com

ఏ విషయంలోనైనా పైచేయిగా తమదే అయ్యి ఉండాలని అనుకుంటారు.కానీ గత కొంత కాలంగా చూస్తే,  టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తోంది.

ముఖ్యంగా దుబ్బాక లో ఎమ్మెల్యే స్థానాన్ని కోల్పోవడం , ఇటీవల జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలలో మెజారిటీ తక్కువగా రావడం, ఇప్పుడు తమ సిట్టింగ్ స్థానం అయిన నాగార్జునసాగర్ నియోజకవర్గం లో జరిగిన ఉప ఎన్నికలలో పార్టీ అభ్యర్ధి విజయం పై పూర్తిస్థాయిలో నమ్మకం లేకపోవడం , ఇలా ఎన్నో అంశాలతో కేసీఆర్ తీవ్ర అసహనం గా ఉన్నారు.
  ముఖ్యంగా కొంతమంది మంత్రుల వ్యవహార శైలి కారణంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్లో చులకన అవుతోందని , వారి వ్యవహార శైలి,  అవినీతి వ్యవహారాలు పార్టీకి , ప్రభుత్వానికి పెద్దగా ఉపయోగపడకపోవడం ఇలా ఎన్నో అంశాలతో కొంతమంది మంత్రులు పనితీరుపై కేసీఆర్ ఆగ్రహంగా ఉంటూ వస్తున్నారు .అయితే సరైన సమయంలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టి,  పార్టీకి ప్రభుత్వానికి పెద్దగా ఉపయోగపడని వారందరినీ తప్పించాలని , వారి స్థానంలో చురుకైన వారికి మంత్రి పదవులు కట్టబెట్టాలని కెసిఆర్ చూస్తున్నారు.అదీ కాకుండా రెండోసారి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ప్రధాన సామాజిక వర్గాలకు మంత్రి పదవి దక్కలేదు.

అలాగే పార్టీ సీనియర్ నాయకులు, మొదటి నుంచి పార్టీ కోసం కష్ట పడిన వారు చాలా మంది ఉన్నారు.వారంతా కేసీఆర్ తమను పట్టించుకోవడం లేదనే అసంతృప్తితో ఉంటున్నారు.

Telugu Congress, Dubbaka, Ministers, Ghmc, Ktr, Nagarjuna Sagar, Telangana, Trs-

  అయితే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టి,  సమర్ధులైన వారికి మంత్రి పదవులు కట్టబెట్టాలని,  దీనికోసం ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్న ఐదారుగురు మంత్రులను తప్పించాలని కెసిఆర్ చూస్తున్నారట .మరో రెండేళ్ళు మాత్రమే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని,  ఆ తర్వాత మళ్లీ ఎన్నికలకు వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉండడంతో,  ఇప్పటి నుంచే జాగ్రత్త లు పడుతున్నారు.ఇలా కొత్తగా మంత్రివర్గంలో చోటు సంపాదించుకునే వారిలో కొంత మంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్లు సమాచారం.  ఏది ఏమైనా నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కేసీఆర్ క్యాబినెట్ ప్రక్షాళన చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube