తెలంగాణలో ప్రైవేట్ టీచర్లకు గుడ్ న్యూస్..!!

కరోనా వైరస్ కారణంగా చాలా రంగాలు నష్టపోయిన సంగతి తెలిసిందే.ఉపాధి దొరక్క చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు .

అయితే ఎక్కువగా మాత్రం నష్టపోయినది ప్రైవేటు టీచర్లు అని చెప్పవచ్చు.లాక్ డౌన్ కారణంగా స్కూలు తెరవని పరిస్థితితో జీతాలు లేక అనేక అవస్థలు పడ్డారు.

ఇలాంటి తరుణంలో వారిని ఆదుకోవడం కోసం తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది.రేపటి నుంచే ప్రైవేట్ టీచర్లకు రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడానికి ఏర్పాటు చేసుకుంటూ ఉంది.

రెండు వేల రూపాయల ఆర్థిక సహాయం మాత్రమేగాక 25 కేజీల బియ్యం అందించాలని డిసైడ్ అయింది.ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్షా 18 వేల మంది ప్రైవేట్ టీచర్లకు సహాయం అందనుంది.

Advertisement

డబ్బులు నేరుగా వారి ఖాతాలో పడే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంది.  వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని గుర్తించిన ప్రభుత్వం .మొత్తం లక్షా 18 వేల మంది ఉన్నట్లు తేల్చింది.నగదు సాయానికి తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికీ 32 కోట్లు మంజూరు చేయగా.పౌరసరఫరాల శాఖ 3.625 టన్నుల సన్నబియ్యం ని సిద్ధం చేసింది.ఈనెల 21 నుంచి 25 వ తారీకు వరకు ఈ సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లకు అందించనుంది.

 .

Advertisement

తాజా వార్తలు