1.మంత్రి మల్లారెడ్డి ని బర్తరఫ్ చేయాలి : బీజేపీ
తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి బర్తరఫ్ చేయాలని రాజీవ్ రహదారిపై బిజెపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు.
2.తెలంగాణలో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 2,478 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
3.సూర్యాపేటలో షర్మిలకు ఘన స్వాగతం
వైయస్ షర్మిల భారీ కాన్వాయ్ సూర్యాపేటకు చేరుకోగా, ఆమెకు పెద్ద ఎత్తున అభిమానులు ఘనస్వాగతం పలికారు.
4.రోజుకు ఆరు లక్షల మందికి టీకా : జగన్
కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
5.మమతకు మరోసారి ఈసీ నోటీసులు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలకు తగిన వివరణ ఇవ్వాలని కోరుతూ ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం మమతా బెనర్జీ కి నోటీసులు జారీ చేసింది.
6.జగన్ కు కేసుల భయం : ఎంపీ రామ్మోహన్ నాయుడు
వైసీపీ కి ఎంత మంది ఎంపీలు ఉన్నా, గట్టిగా ఏపీ సమస్యలపై కేంద్రాన్ని నిలదీశారా అంటూ టిడిపి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.దీనికి కారణం జగన్ కు ఉన్న కేసులు భయమే కారణం అని రామ్మోహన్ విమర్శించారు.
7.వారి పై కోర్టుకు వెళ్తా అంటున్న రాధిక
తన ఆరోగ్యంపై వదంతులు సృష్టిస్తున్న వారి పై కోర్టుకు వెళ్తానని సినీ నటి రాధిక అన్నారు.
8.భారీ కాన్వాయ్ తో ఖమ్మం బయల్దేరిన షర్మిల
ఈరోజు ఖమ్మం లో కొత్త పార్టీ పేరును ప్రకటించడమే కాకుండా భారీ బహిరంగ సభను నిర్వహించ తలపెట్టిన షర్మిల భారీ కాన్వాయ్ తో ఖమ్మం కు బయలుదేరారు.
9.విశాఖ లో టిడిపి కార్పొరేటర్ల పాదయాత్ర
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కూర్మన్నపాలెం జంక్షన్ నుంచి విశాఖ నగర పాలక సంస్థ కార్యాలయం వరకు టిడిపి కార్పొరేటర్లు పాద యాత్ర నిర్వహించారు.
10.కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ
కర్ణాటకలో బెంగళూరు తో సహా ఏడు ప్రధాన నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.
11.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా జీవీఎంసీ కౌన్సిల్ లో మేయర్ హరి వెంకట కుమారి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జివిఎంసి కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
12.తెలంగాణకు మరో టెక్స్ టైల్ పరిశ్రమ
తెలంగాణలో మరో టెక్స్ టైల్ పరిశ్రమ ఏర్పాటు కానుంది.ఈ మేరకు గోకుల్ దాస్ ఇమేజెస్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
13.కోవిడ్ వ్యాక్సిన్ కొరత లేదు : కిషన్ రెడ్డి
ప్రజల భాగస్వామ్యం లేకుండా కరోనా మహమ్మారి పై విజయం సాధించలేము అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.దేశవ్యాప్తంగా ఎక్కడా వాక్సిన్ కొరత లేదు అని కిషన్ రెడ్డి అన్నారు.
14.కరోనా ఎఫెక్ట్ : ఒక్కరోజే 780 మంది మృతి
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది.ఈ వైరస్ ప్రభావంతో ఒక్కరోజే 780 మంది మృతి చెందారు.
15.చంద్రబాబును కలిసిన వైసీపీ కీలక నేత
టిడిపి అధినేత చంద్రబాబును శ్రీకాళహస్తిలో కడప జిల్లా రాయచోటికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రామ్ ప్రసాద్ రెడ్డి కలిశారు.ఆయన ఈనెల 14వ తేదీన టిడిపి లో చేరనున్నారు.
16.జగన్ 99 తప్పులు చేశాడు
వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్ ఇప్పటికే 99 తప్పులు చేశాడని వైసిపి తిరుపతి కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్ విమర్శించారు.
17.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగుతోంది.గురువారం శ్రీవారిని 37,909 మంది దర్శించుకున్నారు.
18.రాజధానిలో దళిత చైతన్య యాత్ర
రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు దళితవాడల్లి చైతన్య యాత్రలు నిర్వహిస్తామని దళిత జెఎసి నాయకులు చెప్పారు.శుక్రవారం నుంచి రోజుకు రెండు గ్రాముల చొప్పున ఈ యాత్రలు నిర్వహించే ఏర్పాట్లు చేసుకున్నామని దళిత జేఏసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో చెప్పారు.
19.బెజవాడ విశాఖలో ‘ రైల్ నీర్ ‘ ప్లాంట్లు
ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీరు అందించే ఉద్దేశంతో దేశంలో మరో ఆరు చోట్ల రైల్ నీర్ బాట్లింగ్ ప్లాంట్స్ ఏర్పాటుకు ఐఆర్సిటిసి సిద్ధమవుతోంది.ఏపీ లోని విజయవాడ విశాఖపట్నం లోనూ ఈ ప్లాంట్స్ ఏర్పాటు కాబోతున్నాయి.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44, 560
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,560.