ప్రముఖ బాలీవుడ్ నటి, టాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ గురించి బాలీవుడ్ పరిచయం ఉన్న వాళ్ళకి తెలిసిందే.బాలీవుడ్ లో ధడక్ అనే సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయం కాగా… ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలలో బిజీగా ఉంది.
అతి తక్కువ సమయంలో తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకుంది జాన్వీ కపూర్.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తన ఖాతా ని చూస్తేనే తెలుస్తుంది.
జాన్వి కపూర్ గతంలో కొన్ని వివాదాలతో వార్తల్లో తెగ వైరల్ గా మారింది.ఇక అప్పటి నుంచి జాన్వీ కపూర్ మరింత రెచ్చిపోతోంది.సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను, వీడియోలను తెగ పంచుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఇదిలా ఉంటే తాజాగా తన ఖాతాలో కొన్ని ఫోటోలను పంచుకోగా అందులో బికినీలో మరింత రెచ్చిపోయింది.
ఓ బీచ్ లో జాన్వీ బికినీలో ఫోటో షూట్ చేయించుకుని వాటిని తన ఫాలోవర్స్ కి షేర్ చేసింది.
అందులో బ్లూ కలర్ బికినీలో ఎంతో హాట్ గా సముద్రం, ఆకాశం కలిసేటట్టు గా భానుడు కనిపిస్తూ ఉన్న బ్యాక్ గ్రౌండ్ లో తన ఫోటోకు ఫోజు ఇచ్చింది.ఈ ఫోటోలను చూసిన నెటిజనులు జాన్వి అందాలను చూసి కనులవిందు చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం సిద్ధార్థ్ సేన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న గుడ్ లక్ జెర్రీ సినిమాలో నటిస్తుంది.
అంతేకాకుండా దోస్తానా 2 అనే మరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈ అమ్మడికి టాలీవుడ్ అవకాశాలు కూడా వస్తున్నాయి.