పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో మనందరికీ తెలిసిందే.ఈ సినిమాతో దాదాపు మూడేళ్ల తరువాత పవన్ రీఎంట్రీ ఇస్తుండటంతో, వకీల్ సాబ్ చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ చూస్తున్నారు.
ఇక బాలీవుడ్‌లో వచ్చిన ‘పింక్’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా రావడంతో పవన్ ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన వకీల్ సాబ్ చిత్రం ప్రేక్షకులను అంచనాలను ఎంతమేర అందుకుందో రివ్యూలో చూద్దాం.
వకీల్ సాబ్ కథ విషయానికి వస్తే, ఓ కేసులో అన్యాయంగా జైలుపాలైన వేముల పల్లవి(నివేదా థామస్)ను కాపాడేందుకు సత్యదేవ్(పవన్ కళ్యాణ్) అనే లాయర్‌ను కలుస్తుంది అంజలి.అయితే ప్రత్యర్థులు సత్యదేవ్ ఈ కేసును వాదించవద్దంటూ బెదిరిస్తారు.
దీంతో సత్యదేవ్, పల్లవి అండ్ ఫ్రెండ్స్ కేసును వాదించేందుకు సిద్ధమవుతాడు.కట్ చేస్తే.
డిఫెన్స్ లాయర్ నంద(ప్రకాష్ రాజ్)తో సత్యదేవ్ పోటాపోటీగా ఈ కేసును వాదిస్తాడు.మరి ఈ కేసును సత్యదేవ్ గెలుస్తాడా లేడా? అసలు పల్లవి అండ్ ఫ్రెండ్స్ ఎందుకు అరెస్ట్ అవుతారు? సత్యదేవ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఏమిటి? అనే విషయాలను వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ సినిమాను దర్శకుడు వేణు శ్రీరామ్ మలిచిన తీరు అద్భుతం అని చెప్పాలి.ఓ రీమేక్ చిత్రంలో పెద్ద మార్పులు చేస్తే ఆ సినిమా అసలుకే ఎసరు పెట్టే అవకాశం ఉంటుంది.కానీ వకీల్ సాబ్ చిత్రం మెయిన్ ప్లాట్‌ను ఏమాత్రం మార్చకుండా, కేవలం హీరో పాత్రను ఎలివేట్ చేసేందుకు కొన్ని కొత్త సీన్స్, ట్రాక్‌లను యాడ్ చేసి దర్శకుడు తన ప్రతిభను చాటుకున్నాడు.ఇక ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ థమన్ అందించిన సంగీతం.
ఇప్పటికే వకీల్ సాబ్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ సినిమాలో ఆయన అందించిన బీజీఎం సినిమాకు పూర్తి బలాన్ని ఇచ్చింది.ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఎందుకు తీశాడో, సినిమాలోని సీన్స్‌ను చూస్తే మనకే అర్థమవుతుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే, పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో పవన్ తనదైన మార్క్ వేసుకున్నాడు.ఈ సినిమాలో పవన్ యాక్టింగ్ సరికొత్తగా అనిపిస్తుంది.ఆయన కళ్లతో పలికించే ఎమోషన్స్‌కు థియేటర్లలో విజిల్స్ పడ్డాయి.అటు నంద పాత్రలో ప్రకాష్ రాజ్ కూడా గట్టి పోటీ ఇచ్చాడు.
నివేధా థామస్, అంజలి, అనన్యాలు తమ పాత్రలకు పూర్త న్యాయం చేశారు.ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలి ఎట్టకేలకు తీరిందనే చెప్పాలి.
చివరగా:
వకీల్ సాబ్ – కోర్టు రూమ్‌లో ‘పవర్’ఫుల్ పర్ఫార్మెన్స్!
రేటింగ్:
3.5/5.0