మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తారిన తొలుత ఊహాగానాలు వినిపించాయి.కానీ ఈ సినిమాను కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
ఇక ఇప్పుడు మెగాస్టార్ ఓ బాలీవుడ్ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.గతంలో చిరు నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ఆయన నటిస్తు్న్న ఓ చిత్రంలో చిరంజీవిని నటించాల్సిందిగా సదరు చిత్ర యూనిట్ కోరిందట.దీంతో చిరు కూడా వెంటనే ఓకే అనేసినట్లు చిత్ర వర్గాల టాక్.
కాగా గతంలో చిరంజీవి పలు స్ట్రెయిట్ హిందీ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.ప్రతిబంధ్, ది జెంటిల్‌మెన్, ఆజ్ కా గుండారాజ్ అనే సినిమాల్లో చిరంజీవి నటించినా, అవి బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యాయి.
దీంతో మళ్లీ ఇన్నాళ్లకు బాలీవుడ్ జనాలను పలకరించేందుకు రెడీ అవుతున్న చిరంజీవి, ఈసారి ఎలాంటి పాత్రలో వారిని అలరిస్తాడో చూడాలి.ఏదేమైనా చిరంజీవి బాలీవుడ్‌లో సినిమా చేస్తున్నాడనే వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది.