మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి చరణ్ ఓ అదిరిపోయే వార్త చెప్పుకొచ్చాడు.ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ఇంటికి వెళ్లే సమయంలో మేకప్ తీసేందుకు ఏకంగా రెండు గంటలకు పైగా సమయం పట్టేదని చెప్పుకొచ్చాడు.
అయితే ఈ సినిమాలో చరణ్ గడ్డం ఉన్న లుక్‌లో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నట్లు దీన్ని బట్టి తెలుస్తోంది.అల్లూరి సీతారామరాజు పాత్ర కోసం చరణ్ భారీగా మేకప్ వేసుకున్నాడని, అది తీసేందుకు చాలా సమయం పట్టేదని చిత్ర యూనిట్ తెలిపింది.
ఏదేమైనా ఆర్ఆర్ఆర్‌లో చరణ్ పాత్రకు సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.ఇక పూర్తీ పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.
భారీ బడ్జెట్ చిత్రంగా వస్తున్న ఆర్ఆర్ఆర్‌ను అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.ఇక ఈ సినిమాతో పాటు చరణ్ ఆచార్య చిత్రంలో సిద్ధ అనే కేమియో పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, మే 13న ఈ సినిమాను భారీ అంచనాలు నడుమ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.