స్టార్ మా లో ప్రసారమైన ది బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి తెలియని వారెవ్వరు లేరు.ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకుని ఐదో సీజన్ కు కూడా అడుగుపెట్టనుంది.
నాలుగు సీజన్ లలో పాల్గొన్న కంటెస్టెంట్ లు గురించి అందరికి తెలిసిందే.మొదటి రెండు సీజన్ లలో పాల్గొన్న కంటెస్టెంట్ ల నుండి అంత క్రేజ్ రాకపోవడంతో మూడవ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లో నుంచి కొంతవరకు షో మీద ఆసక్తి రాగా సీజన్ ఫోర్ లో మరింత గా ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే సీజన్ 5 త్వరలోనే ప్రారంభం కావడంతో షో కు సంబంధించిన పలు ఏర్పాట్లు జరుగుతున్నాయి.మొదటి నాలుగు సీజన్ లలో హోస్టింగ్ చేసిన స్టార్ నటులు ఎన్టీఆర్, నాని, నాగార్జున లు పాల్గొనగా సీజన్ 4 లో కూడా నాగార్జున హోస్ట్ చేశారు.
ఇక సీజన్ 5 లో కూడా నాగార్జున నే మళ్ళీ హోస్టింగ్ చేయనున్నారట.అంతేకాకుండా సీజన్ 4 లో తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకొన్న కంటెస్టెంట్ సోహెల్ సీజన్ 5 లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేయనున్నారట.

సీజన్ 4 లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను సీజన్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.గత ఏడాది బిగ్ బాస్ సీజన్ 4 కరోనా నేపథ్యంతో ఆలస్యం కాగా ఈ ఏడాది సీజన్ 5 ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఇక సీజన్ 5 లో పాల్గొనే కంటెస్టెంట్ లను జబర్దస్త్ కామెడీయన్హైపర్ ఆది, యాంకర్ రవి పేర్లు వినిపిస్తున్నాయి.ఇక సీజన్ 5 లో గుర్తింపు పొందిన వ్యక్తులను తీసుకోనున్నట్లు తెలుపుతున్నారు.
ఇక ఈ షో ను జూలై ఆఖరి వారం లేదా మే మొదటి వారం లో ప్రారంభంకానుంది.