సంవత్సరాలకు సంవత్సరాలు గడుస్తున్నా బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ షోకు ప్రేక్షకుల ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదు.మొదట్లో గురువారం మాత్రమే జబర్దస్త్ షో ప్రసారం కాగా ఆ తరువాత ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో శుక్రవారం కూడా ప్రసారమవుతోంది.
ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షో ద్వారా ఇమ్మాన్యుయేల్ పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.వర్ష, ఇమ్మాన్యుయేల్ కలిసి చేస్తున్న స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
రోజా సైతం ఇమ్మాన్యుయేల్ చేసే స్కిట్లను ప్రోత్సహిస్తూ ఉంటుంది. రోజా ఇమ్మాన్యుయేల్ వేసే పంచ్ లు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇటీవల సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చిన ఇమ్మాన్యుయేల్ కు రోజా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.రోజా గారు తనను ప్రతి విషయంలో ఎంతో సపోర్ట్ చేస్తున్నారని.
ఆమెను తాను అమ్మ అని పిలుస్తానని వెల్లడించారు.రోజాగారు తనకు చాక్లెట్ బాయ్ అనే నిక్ నేమ్ పెట్టారని తెలిపారు.
జబర్దస్త్ షోతో పాటు బయట కూడా చాలామంది తనను చాలామంది తనను చాక్లెట్ బాయ్ అని పిలుస్తారని.థ్యాంక్యూ రోజా అమ్మ అంటూ రోజా గారిపై అభిమానాన్ని చాటుకుంటున్నారు.మరోవైపు వర్ష ఇమ్మాన్యుయేల్ మధ్య లవ్ ట్రాక్ గురించి అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి.అయితే స్కిట్లపై క్రేజ్ పెంచడం కోసమే అలా చేస్తున్నారని అంతకు మించి వాళ్లిద్దరి మధ్య ఏం లేదని తెలుస్తోంది.
మరోవైపు ఇమ్మాన్యుయేల్ పై రోజా వేస్తున్న సెటైర్లకు సంబంధించిన ప్రోమోలు సైతం లక్షల్లో వ్యూస్ తెచ్చుకుంటున్నాయి.సీరియళ్ల ద్వారా బుల్లితెరకు పరిచయమైన వర్ష జబర్దస్త్ షోలలో స్కిట్లు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటుంటున్నారు.
రష్మీ సుధీర్, హైపర్ ఆది వర్షిణి జోడీల్లా ఇమ్మాన్యుయేల్ వర్ష జోడీలకు సైతం పాపులారిటీ సంపాదించుకోవడం గమనార్హం.