వంటలక్క ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది కార్తీకదీపం దీప.ఈ వంటల గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తన నటనతో అంతగా ప్రేక్షకుల మనసును దోచుకున్నారు.కార్తీకదీపం సీరియల్ ద్వారా పరిచయమైన ప్రేమి విశ్వనాథ్ దీప క్యారెక్టర్ లో నటించి అందరినీ ఆకట్టుకున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమెకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారంటే ఆమె నటన ఏ విధంగా ఉంటుందో ఇట్టే అర్థమైపోతుంది.

స్టార్ మాలో ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ కు వచ్చే రేటింగ్ మరి ఏ ఇతర సీరియల్స్ లేదా బిగ్ బాస్ వంటి రియాల్టీ షో కి సైతం రాలేదంటే ఈ సీరియల్ అంత పాపులారిటీని సంపాదించుకుంది.అందులో దీప క్యారెక్టర్ లో నటించిన ప్రేమి విశ్వనాథ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక హీరోయిన్ రేంజ్ లో ఉంది.కేవలం నటిగా మాత్రమే కాకుండా ఆమె వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు కూడా ఆమె అభిమానులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు.
సోషల్ మీడియా లో ప్రేమి విశ్వనాథ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది.
తాజాగా ప్రేమి విశ్వనాథ్ తన స్వస్థలం కేరళలో ఉన్నారు.
కేరళలలో ఉన్న దీప తాజాగా గంటకు ఒక చీర చొప్పున నాలుగు గంటలలో నాలుగు చీరలను మార్చి ఒకే లొకేషన్ లో ఫోటోషూట్ జరుపుకున్నారు.అయితే ఇవన్నీ ఏదైనా షూటింగ్ కోసమో లేదా ఫంక్షన్ కోసమో కాదు.
కేవలం సారీస్ కలెక్షన్ లో భాగంగా వివిధ రంగు రంగుల చీరలలో ఫోటో షూట్ జరుపుకున్నారు.రంగు రంగు చీరలో ఉన్న ఈ ఫోటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ ఫోటోలను చూసిన కొందరు అభిమానులు చీరలో ఎంతో అందంగా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు.