సీతూ పాప కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ 'సీత' చిన్న బహుమానం

మహేష్‌ బాబు కూతురు సితార అలియాస్‌ సీతూ పాప సోషల్‌ మీడియా సెన్షేషన్‌ అనే విషయం తెల్సిందే.రెగ్యులర్‌ గా సితార పాప సోషల్‌ మీడియాలో సండి చేస్తూనే ఉంటుంది.

 Alia Gift To Mahesh Babu Daughter Sitara, Sitara, Mahesh Babu, Alia Bhatt, Rajam-TeluguStop.com

తనకంటూ ఒక ప్రత్యేక ఇన్‌ స్టా పేజీ ఉంది.అందులో లేదంటే అమ్మ పేజీలో కాదంటే నాన్న పేజీలో ఇలా ఎందులో ఒక దాంట్లో సితార కనిపిస్తూనే ఉంటుంది.

డాన్స్‌ లు ఆటలు పాటలు ఇలా ఎన్నో ఎన్నెన్నో సీతూ పాపను సోషల్‌ మీడియాలో ఉంచుతూ ఉంటాయి.ఈమద్య ఎక్కువగా నాన్నతో ఆడుకుంటున్న ఫొటోలను మరియు వీడియోలను షేర్‌ చేస్తున్న సితార మరియు నమ్రతలు ఈసారి చాలా ప్రత్యేకమైన ఫొటోను షేర్‌ చేశారు.

ఆ ఫొటో లో సితార వేసుకున్న డ్రస్‌ చాలా చాలా ప్రత్యేకమైనది గా నమ్రత పేర్కొంది.

బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్‌ ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ కు వచ్చింది.వచ్చిన వెంటనే రాజమౌళిని కలిసి ఆలియా భట్‌ ఆ తర్వాత నమ్రతను కలిసినట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఆలియా కోసం ఒక ప్రత్యేకమైన డ్రస్‌ ను ఆలియా ముంబయి నుండి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఆలియా భట్‌ కు నమ్రతకు మద్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.ఆలియా కుటుంబంకు మరియు నమ్రత కుటుంబంకు ముందు నుండి కూడా పరిచయం ఉంది.ఆ పరిచయంతోనే నమ్రత ముంబయి వెళ్లిన ప్రతి సారి ఆలియాను కలుస్తూ వస్తుంది.అలాగే ఆలియా హైదరాబాద్‌ వస్తే మహేష్‌ బాబు ఇంటికి వెళ్తూ ఉంటుందట.

ఇటీవల సితార కోసం ఈ ప్రత్యేకమైన డ్రస్‌ ను తీసుకుని వచ్చిందని స్వయంగా నమ్రత సోషల్‌ మీడియా ద్వారా పేర్కొంది.ఆలియా భట్‌ మూడు వారాల పాటు ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ లోనే ఉండబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube