అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేను ఖచ్చితంగా విజయం సాధిస్తానన్న ట్రంప్ ఆశలన్నీ అడియాశలయ్యాయి.పాపం.
జో బైడెన్ పై అత్యధిక మెజార్టీతో గెలుస్తానని తాను కన్న కలలన్నీ పేకమేడల్లా కూలడంతో ట్రంప్ నోరు మూగబోయిందని చెప్పుకోవచ్చు.దీంతో చేసేదేంలేక మున్ముందు ఎలా గడపాలనే ఆలోచనలో పడ్డారు ట్రంప్.
కాని ఏమాటకామాటే చెప్పుకోవాలండీ బాబూ.మన ట్రంపు సారు మంచి మనిషిగా మారారంటా.
అదెలాగా అతని గురించి అదరికీ తెలుసుకదా అంటారు.హా మీరు విన్నది అధ్యక్షపదవిలో ఇంతకు ముందు వున్నప్పుడు.
కాని ఇప్పుడు ట్రంప్ పూర్తిగా మారి ఓ ప్రాణికి ప్రాణభిక్ష పెట్టాడట.అదేంటి ప్రాణభిక్ష పెట్టడమా.అని ఆలోచిస్తున్నారా.నిజమేనండి బాబూ.కావాలంటే ఈ ఆర్టికల్ ను చదివి మరి ట్రంప్ సారు ఎవరికి ప్రాణభిక్ష పెట్టారో తెలుసుకోండి.
అధ్యక్షుడిగా
మిగిలిన సమయానికి సంబంధించిన అధికార కార్య్రమాలపై ట్రంప్ ధృష్టిని సారించారు.
అంటే శ్వేత సౌధంలో భాగంగా థ్యాక్స్ గివింగ్ డేకు ముందుగా జరిగే నేషనల్ థ్యాక్స్ గివింగ్ టర్కీ వేడుకల్లో ట్రంప్ పాల్గొన్నాడు.ఈ కార్యక్రమం రోజ్ గార్డెన్ జరిగింది.
ఈ వేడుకల్లో భాగంగా అక్కడి సాంప్రదాయం ప్రకారం అమెరికా అధ్యక్షుడికి రెండు టర్కీ కోళ్లను బహుమతిగా అందిస్తారు.దీనిని ది నేషనల్ టర్కీ ఫెడరేషన్ అందిస్తుంది.
అయితే ఆ టర్కీ కోళ్లను ఇష్టముంటే విందుగా కూడా అంగీకరించవచ్చట.కాని ట్రంప్ సారు మాత్రం వాటిని బతకండని విందుగా ఆరగించకుండా వదిలేశాడట.
అయితే జార్జి డబ్ల్యూ బుష్ కు ముందున్న అధ్యక్షులంతా ఈ కోల్లను విందుగా ఆరగించేవారట.కాని అబ్రహం లింకన్ కుటుంబానికి కూడా ఈ టర్కీ కోళ్లను విందుకోసం బహూకరించారు.కాని అంతకు ముందు సంవత్సరంలో అబ్రహం లింకన్ కుమారులైన టెడ్ కు, విలింయంకు టైఫాయిడ్ వచ్చిందట.దాంతో విలియం చనిపోయాడు.కాని టెడ్ మాత్రం బతికి బట్టకట్టాడు.దాంతో అతను టర్కీ కోడిని తినవద్దని తన తండ్రికి విన్నవించుకున్నాడట.
దాంతో లింకన్ అప్పటి నుంచి టర్కీ కోళ్లను తినడం మానేసి ప్రాణ భిక్ష పెట్టాడు.
అప్పటి నుంచి చాలా మంది అధ్యక్షులు టర్కీలను వదిలేయడంతో ఈ కోళ్లను డిస్నీ ల్యాండ్ రిసార్ట్ కు తరలించి పెంచేవారట.
కాని ఆ తర్వాతి కాలంలో ఆ టర్కీ కోళ్లను మౌంట్ వెర్నాన్ లోని జార్జ్ వాషింగ్టన్ ఇంటికి తరలించేవారట.లేకపోతే లీస్ బర్గ్ లోని మోర్వెన్ పార్క్ కు తరలించి వాటిని పెంచి పోషించేవారట.
ఈ ఆచారం 1863 నుంచే అమలులో ఉండటం విశేషం.అయితే ఇందులో భాగంగానే ట్రంప్ విందుకోసం ఇచ్చిన రెండు కోళ్లను ఆయన విందుకు ఆరగించకుండా వాటికి ప్రాణ భిక్ష పెట్టడం పెద్ద విశేషంగా మారిందని చెప్పుకోవచ్చు.