తాజాగా టీమిండియా ఆటగాళ్లు ఐసీసీ ప్రకటించిన ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నామినేట్ అయ్యారు.ఇందులో భాగంగా టీమిండియా జట్టు అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ, జట్టులోని సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ దశాబ్దపు ఐసీసీ ప్లేయర్ అవార్డుకు నామినేట్ అయ్యారు.
ఇదివరకు విరాట్ కోహ్లీ ఎన్నో అవార్డ్స్ సాధించినా మరోసారి ఐసీసీ ప్రతిష్టాత్మకంగా అవార్డ్ లకు నామినేట్ అయ్యాడు.ఇందులో భాగంగానే తాజాగా దశాబ్దపు వన్డేకు, టెస్ట్ మ్యాచ్ లకు గాను విరాట్ కోహ్లీ నామినేట్ అయ్యాడు.
ఇక దశాబ్దపు వన్డే ప్లేయర్ అవార్డు కోహ్లితో పాటు భారత్ నుండి మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ ఎంఎస్ ధోని అలాగే ప్రస్తుత టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నామినేట్ అయ్యారు.ఈ అవార్డ్స్ లో ఈ దశాబ్దపు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు గాను మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీ లు భారత్ నుండి నామినేట్ అయ్యారు.
అలాగే ఈ దశాబ్దపు టి20 ప్లేయర్ అవార్డులకు గాను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీమ్ ఇండియా నుండి నామినేట్ అయ్యారు.
ఇలా ప్రతి దేశం నుంచి కొందరు ఆటగాళ్లు ఐసిసి ప్రతిష్టాత్మకంగా ప్రకటించే అవార్డు రేసులో ఆటగాళ్లు ఉన్నారు.
ఐసిసి నిర్వహించే ఓట్లను ప్రకారం ఎవరైతే అత్యధిక ఓట్లు సంపాదిస్తారో ఆ ఆటగాళ్లు విజేతలుగా నిలుస్తారు.ఇక పురుషుల క్రికెట్ లో ఈ దశాబ్దపు ఆటగాడిగా నామినేట్ అయిన వారిలో భారత్ నుండి విరాట్ కోహ్లీ, అశ్విన్ ఉండగా మిగతా ఆటగాళ్ళ విషయానికి వస్తే.
జో రూట్, విలియంసన్, స్టీవ్ స్మిత్, ఎబి డివిలియర్స్, కుమార సంగక్కర నామినేట్ అయ్యారు.మరోవైపు పురుషుల క్రికెట్ లో దశాబ్దపు వన్డే ప్లేయర్ లిస్టు లో భారత్ నుండి కోహ్లీ, రోహిత్ శర్మ, ఎంఎస్ ధోని తో పాటు శ్రీలంక దేశం నుండి మలింగ, సంగక్కర, మిచెల్ స్టార్క్, ఏబీ డివిలియర్స్, సంగక్కర లు నామినేట్ అయ్యారు.
ఇక టెస్ట్ ఆటగాళ్ల లిస్టులో వచ్చేసరికి భారత్ నుంచి కేవలం కోహ్లీ ఎంపిక అవ్వగా ఈ లిస్టులో విలియంసన్, స్టీవ్ స్మిత్, ఆండర్సన్, రంగన హెరాత్, యాసిర్ షా ఎంపికయ్యారు.