ఆ లిస్ట్ లో మోడీ తర్వాత స్థానం జగనే.!

సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతగా హవా కొనసాగుతోంది.గూగుల్ సెర్చ్, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ ప్లాట్ ఫార్మ్స్ లో అత్యధికంగా ట్రెండ్స్ మోడీ పేరు పైన కొనసాగుతున్నాయి.

తాజాగా ఆగస్టు నెల నుంచి అక్టోబర్ నెల వరకు వివిధ సోషల్ మీడియాలో ట్రెండ్స్ ను చెక్ బ్రాండ్స్ అనే సంస్థ నివేదిక రూపంలో వివరాలు వెల్లడించింది.ఇందుకు సంబంధించి మొత్తం 90 రోజుల వ్యవధిలో 95 మంది పొలిటికల్ లీడర్ లను అలాగే 500 మంది అత్యంత ప్రభావశీలురైన వారిని సంబంధించిన ట్రెండ్స్ ను చెక్ బ్రాండ్స్ వెల్లడించింది.

ఇందుకోసం ఆ సంస్థ ఏకంగా పది కోట్ల ఆన్లైన్ ఇంప్రెసియన్స్ ను ఆధారంగా చేసుకుని ఈ లిస్టు ను విడుదల చేసింది.ఏ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ తీసుకున్నా సరే అత్యధికంగా ట్రెండ్స్ ను మాత్రం ప్రధాని మోడీ పై ఉన్నాయి.

ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం భారత ప్రధాని నరేంద్ర మోడీ 2171 ట్రెండ్స్ తో టాప్ పొజిషన్ లో ఉండగా కేవలం అతి తక్కువ పాయింట్లు తేడాతో 2137 ట్రెండ్స్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండో స్థానంలో నిలిచాడు.ఈ లిస్టులో ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వరస స్థానాల్లో ఉన్నారు.

Telugu Adithyanath, Modi-Latest News - Telugu

ఇక అదే విధంగా ప్రధాని మోడీ బ్రాండ్ స్కోర్ విషయంలోనూ టాప్ స్కోరర్ గా నిలిచాడు.70 స్కోర్ తో ప్రధాని మోడీ తొలి స్థానంలో ఉండగా ఆ తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా 36.4 స్కోర్ తో రెండో స్థానంలో ఉండగా.ఆపై తాజాగా మరణించిన అస్సాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ 31.89 తోపాటు అరుణాచల్ ముఖ్యమంత్రి ఫెమా ఖండూ ఉన్నారు.ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఉన్నారు.

వీటితో పాటు బ్రాండ్ వాల్యూ విషయంలో కూడా ప్రధాని మోడీ తొలి స్థానంలో కొనసాగుతుండగా ఆ తర్వాతి స్థానాల్లో కేంద్ర మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొనసాగుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube