తెలుగు ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “నేనింతే” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు నటిగా పరిచయమైన తెలుగమ్మాయి “అభినయ” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అభినయ కి చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఎక్కువగా ఉండేది.
కానీ నటి అభినయ పుట్టుకతోనే మూగ మరియు చెవుడు.అయినప్పటికీ నటి కావాలనే సంకల్పం ముందు తన అంగ వైకల్యం ఓడి పోయింది.
కాగా తమిళంలో ప్రముఖ దర్శకుడు సముద్ర ఖని దర్శకత్వం వహించిన “నాడోడిగళ్” అనే చిత్రంలో మొదటగా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఇటువంటి ఓ హీరోయిన్ ని నటింప చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు అనుకున్నారట. కానీ ఆ బాలీవుడ్ హీరోయిన్ ఎక్కువగా షరతులు పెట్టడం మరియు తమిళ డైలాగులను చెప్పలేక చిత్ర యూనిట్ సభ్యుల పై అసహనం వ్యక్తం చేయడంతో ఆమెను వెంటనే చిత్రం నుంచి తొలగించారట.
అంతేగాక తమిళ భాషను చిన్నచూపు చూసినటువంటి ఆ బాలీవుడ్ హీరోయిన్ కి బుద్ధి చెప్పేందుకు దర్శకుడు సముద్ర ఖని ఈ చిత్రంలో నటి అభినయని హీరోయిన్ గా నటింపజేసి తన సత్తా నిరూపించుకున్నాడు.
దీంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడమే కాకుండా నటి అభినయ సినీ కెరీర్ కి కూడా బాగానే దోహద పడింది.
దీంతో అప్పటి నుంచి అభినయ కి సినిమా అవకాశాలు క్యూ కట్టాయి.అయితే అందరి నటీనటుల లాగా అభినయ సినిమా డైలాగులు చెప్పలేక పోయినప్పటికీ సన్నివేశాలకు తగ్గట్టుగా తన హావ భావాలను పలికిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
నటి అభినయ ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తోంది. కానీ తమిళంలో మాత్రం హీరోయిన్ గా నటిస్తోంది.అయితే తెలుగులో నటి అభినయ నటించినటువంటి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నేనింతే, శంభో శివ శంభో, రాజు గారి గది-2, ధ్రువ, తదితర చిత్రాలు ఈ అమ్మడికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. అంతేగాక తమిళంలో మొదటగా హీరోయిన్ గా నటించిన “నాడోడిగళ్” అనే చిత్రం ద్వారా ఏకంగా 13 అవార్డులను గెలుచుకుంది.
దీంతో సాధించాలనే పట్టుదల ఉంటే అంగ వైకల్యం అడ్డురాదని నటి అభినయ నిరూపించింది.