అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ త్వరలో తన పదవి నుంచీ దిగిపోనున్నారు. శ్వేత సౌధంలో భోగ భాగ్యాలు అనుభవించిన ట్రంప్ జవవరి 20 తరువాత తన సొంత ఇంటికి వెళ్ళడానికి సిద్దమయ్యారు.
నిన్నటి రోజున మీడియాతో మాట్లాడుతూ బిడెన్ గెలుపును ఒప్పుకుంటూనే అన్యాయంగా గెలిచాడంటూ విమర్శలు చేశారు.ఏది ఏమైనా ట్రంప్ త్వరలో తన పదవి నుంచీ తప్పుకోనున్నారు.
అయితే తన పదవిలో ఉన్న సమయంలో ట్రంప్ పై ఎన్నో రకాల విమర్శలు, ఎన్నో కేసులు నమోదు అయ్యాయి..
ముఖ్యంగా పన్ను ఎగావేతపై ఎన్నో కేసులు నమోదు అయ్యాయి.కానీ
ట్రంప్ అధ్యక్షుడిగా ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకోవడానికి కొన్ని న్యాయపరమైన అడ్డంకులు రావడంతో వాటి ప్రభావం ట్రంప్ పై పెద్దగా చూపలేదు.కానీ అధ్యక్ష హోదా పోయిన రోజు మొదలు ట్రంప్ కు కేసుల ఎఫ్ఫెక్ట్ భారీగా చూపుతుందని అంటున్నారు పరిశీలకులు.అయితే ప్రస్తుతం పదవిలో ఇంకా కొనసాగుతున్నారు కాబట్టి తన అధికారాన్ని ఉపయోగించి ట్రంప్ బయటపడే అవకాశాలు లేకపోలేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఎలాంటి కేసుల్లో అయినా తనని తను కాపాడుకునే అధికారం తనకు ఉందని ట్రంప్ ఒకానొక సందర్భంలో అన్నారు కూడా .కానీ
అధ్యక్షుడు కేసుల మాఫీ విషయం కేవలం ఫెడరల్ నేరాలకి మాత్రమే వర్తిస్తుందని కానీ రాష్ట్ర స్థాయిలోని నేరాలకు వర్తించదు.దాంతో ట్రంప్ తనని తానూ రక్షించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలించవని అంటున్నారు న్యాయనిపుణులు.అధ్యక్షుడు క్షమాభిక్ష తనకి తానుగా పెట్టుకున్న సందర్భం ఇప్పటివరకూ రాలేదని అన్నారు.అయితే అధ్యక్షుడు కేసుల నుంచీ తప్పించుకోవడానికి ఒక అవకాశం ఉందని ట్రంప్ తాత్కాలికంగా రాజీనామా చేసి ఉపాధ్యక్షుడిగా ఉన్న మైక్ పెన్స్ ను అధ్యక్షుడిని చేసి ఆయన సాయంతో ప్రెసిడెన్షియల్ పార్దన్ అధికారాలను ఉపయోగించి కేసుల నుంచీ బయటపడవచ్చని అందుకు అమెరికా రాజ్యాంగంలోని 25వ చట్టసవరణ అవకాశం కల్పిస్తుందని అంటున్నారు.