అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ తరుపున అగ్ర రాజ్యానికి ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయిన కమలా హారీస్ ప్రజా ఆమోదయోగ్యమైన విధంగా పరిపాలన సాగించాలని డిసైడ్ అయ్యారు.అమెరికా ప్రజలకు హామీ ఇచ్చినట్టుగానే అన్ని వర్గాల వారికి న్యాయం జరిగేలా, మధ్య, దిగువ తరగతి ప్రజలకు న్యాయం జరిగి వారి ఆర్ధికాభివృద్ధి కి దోహాద పడే కార్యకరమాలను రూపొందించడానికి ప్రణాళికలు సిద్దం చేసుకున్నారు.
ఇప్పటికే పరిపాలనా విధానం, అధికారిక బదలాయింపులపై దృష్టి పెట్టిన కమలా హారీస్ తాజాగా సంచనల నిర్ణయం తీసుకున్నారు.
అమెరికాలోని మధ్య, దిగువ ఆదాయాలు పెద్దగా ఉండని వారికి శుభవార్త చెప్పారు.
4 లక్షల డాలర్ల లోపు వార్షిక ఆదాయం కలిగే వారెవరికైనా కొత్తగా పన్నుల భారం మోపమని, వారు మరింతగా ఆర్ధికంగా ఎదగడానికి వారికి అండగా ఉంటామని ప్రకటించారు.ఇక ధనికులు, అత్యంత పెద్ద వ్యాపారా సంస్థలు ఎవరైనా సరే పన్నులు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం అమెరికా ఆర్ధిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, కరోనా కారణంగా ప్రభుత్వానికి ఆదాయం మాట పక్కన పెడితే ఖర్చులు ఎక్కువయ్యాయని అందుకే ఈ విషయాలపై కమలా హరీస్ దృష్టిపెట్టి ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.
నిన్నటి రోజున కమలా హరీస్ తన భర్త తో కలిసి వెళ్తున్న క్రమంలో స్థానికంగా ఓ వృద్దుడు నడుపుకుంటున్న బేకరీ షాపులో ఆగి అతడితో మాట్లాడి అతడి వ్యాపార అభివృద్దికి ఎలాంటి సాయం కావాలనే విషయాలను తెలుసుకున్నారు.అనంతరం అమెరికా అధ్యక్షుడు బిడెన్ ప్రభుత్వ పన్నుల విధానంపై పలు ట్వీట్ లు చేశారు.అమెరికాలో ఉండే చిన్న చిన్న షాపులే స్వయం శక్తిగా ఎదిగేలా చేస్తాయని తెలిపారు.
తాజా పరిస్థితి చూస్తుంటే మాత్రం ధనవంతులకు మాత్రం త్వరలో పన్నుల రూపంలో బిగ్ షాక్ ఇవ్వడానికి బిడెన్ ప్రభుత్వం సిద్దంగా ఉందనే సూచనలు స్పష్టంగా తెలుస్తోంది.