అమెరికా రక్షణ శాఖలో ఇండో అమెరికన్‌కు కీలక పదవి

భారత సంతతికి చెందిన కశ్యప్ ప్రమోద్ పటేల్ (కాష్‌ పటేల్‌)కు అమెరికాలో కీలక పదవి దక్కింది.యూఎస్ రక్షణ కార్యదర్శి క్రిస్ మిల్లర్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ప్రకటించారు.

 Indian-american Kash Patel Named Chief Of Staff To Acting Us Defence Secretary,-TeluguStop.com

ఈ మేరకు పెంటగాన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.న్యూయార్క్‌లో జన్మించిన కశ్యప్‌ పటేల్‌కు భారత్‌లోని గుజరాత్‌ మూలాలున్నాయి.ఆయన తల్లిదండ్రులు తూర్పు ఆఫ్రికాకు చెందినవారు.1970లో కెనడా నుంచి వచ్చి అమెరికాలోని న్యూయార్క్‌లో స్థిరపడ్డారు.

ప్రాథమిక విద్య అనంతరం ఫ్లోరిడాలో ఉన్నత విద్యను అభ్యసించిన కశ్యప్‌ పటేల్‌ వాషింగ్టన్‌ డీసీకి ప్రాసిక్యూటర్‌గా పనిచేశారు.ఆ తర్వాత తూర్పు ఆఫ్రికా, కెన్యా, అమెరికా సహా పలు ప్రాంతాల్లో సేవలందించారు.గతంలో వైట్‌హౌస్‌ పర్మనెంట్ సెలెక్ట్ కమిటీలో జాతీయ ఉగ్రవాద నిరోధక సీనియర్ న్యాయవాదిగా పటేల్ పనిచేశారు.2019 జూన్‌లో జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్‌సీ) సీనియర్‌ డైరెక్టర్‌గానూ విధులు నిర్వహించారు.ఈ క్రమంలోనే ఆయనను డిఫెన్స్‌ విభాగంలోని స్పెషల్ ఆ‌పరేషన్‌ కమాండో సభ్యునిగా యూఎస్‌ ప్రభుత్వం నియమించింది.

కాగా అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రక్షణ శాఖ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌ని తొలగిస్తున్నట్లు తెలిపారు.ఈ మేరకు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

ఇప్పటి వరకు దేశానికి అందించిన సేవలకు గాను ఎస్పర్‌కు ట్రంప్ కృతజ్ఙతలు తెలియజేశారు.ఇక ఎస్పర్‌ స్థానంలో క్రిస్టోఫర్ సీ మిల్లర్ తాత్కాలిక రక్షణశాఖ కార్యదర్శిగా తక్షణమే బాధ్యతలు చేపడతారని అమెరికా అధ్యక్షుడు ట్వీట్‌లో పేర్కొన్నారు.

డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల హయాంలో ఎస్పర్‌ నాలుగో పెంటగాన్‌ చీఫ్‌గా పని చేశారు‌.బాధ్యతలు స్వీకరించిన 16 నెలల తర్వాత ఎస్పర్‌ని ఉద్యోగంలో నుంచి తొలగించారు.

Telugu America, Donald Trump, Indianamerican, Secretary-Telugu NRI

ఆయన ప్రస్తుతం జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్ర డైరెక్టర్‌గా సెనెట్ క్రిస్టోఫర్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసిందని ట్రంప్ గుర్తుచేశారు.ఎస్పర్‌ స్థానంలో నియమితులైన క్రిస్టోఫర్‌ మిల్లర్‌ దాదాపు 31 ఏళ్ల పాటు సైన్యంలో పని చేశాడు.2001 అఫ్ఘనిస్తాన్‌లో, 2003లో ఇరాక్‌లో మోహరించిన ప్రత్యేక బలగాల్లో పని చేశాడు.రిటైర్‌మెంట్‌ తర్వాత ప్రభుత్వ రహస్య ఆపరేషన్‌లు, ఇంటిలిజెంట్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు.2018-2019లో అతను తీవ్రవాద నిరోధకత, ట్రాన్స్‌నేషనల్‌ థ్రెట్స్‌ విభాగంలో వైట్ హౌస్ సలహాదారుగా పనిచేశాడు.2019 నుంచి ప్రత్యేక కార్యకలాపాల కోసం రక్షణ సహాయ కార్యదర్శిగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube