సినిమాలు మానేసి పాపుల‌ర్ అయిన సెలబ్రెటీలు వీళ్లే!

ఒక్కే ఒక్క ఛాన్స్ అంటూ సినిమా ఆఫీస్ లు చుట్టూ, నిర్మాతల చుట్టూ తిరిగే రోజులు పోయాయి.అవకాశాలు వ‌స్తే యాక్ట్ చేస్తున్నారు.

 Popular Celebrities Who Miss Movies!, Hero Raja, Nagma, Divya Vani, Mohini, Cele-TeluguStop.com

లేదంటే చిన్న నటుల నుంచి హీరోల వ‌ర‌కు సినిమాలే కాదు బ‌య‌ట ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీబిజీగా గ‌డిపేస్తున్నారు.అలాంటి‌ వారు ఎవరో ఇక్కడ చదివి తెలుసుకుందాం.

హీరో రాజా:

రాజా హీరోగా శేఖ‌ర్ ఖ‌మ్ముల డైరక్ష‌న్ లో తెర‌కెక్కిన చిత్రం ఆనంద్.ఈ సినిమాతో రాజా ఓవ‌ర్ నైట్ స్టార్ డ‌మ్ సంపాదించుకున్నారు.14 ఏళ్ల వ‌య‌స్సులో త‌ల్లి, తండ్రిని పోగొట్టుకున్న రాజా తొల‌త ఎయిర్ లైన్స్ లో ఉద్యోగం చేసి అక్క‌లకు పెళ్లి చేశారు.సినిమాల‌పై ఉన్న మ‌క్కువ‌తో ఎయిర్ లైన్స్ ఉద్యోగాన్ని ప‌క్క‌నపెట్టి అమెరికా వెళ్లి థియేట‌ర్ యాక్టింగ్ కోర్స్ నేర్చుకొని టాలీవుడ్ లో ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాడు.

ఆ త‌రువాత‌ ఓ చిన‌దాన సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.అయితే ప‌లు సినిమాలు చేసిన రాజా త‌న జీవితాన్ని దేవుడికి అంకితం చేశారు.

మ‌త ప్ర‌భోద‌కుడిగా మారి బిజీ అయ్యారు.

Telugu Divya Vani, Raja, Mohini, Nagma-Movie

న‌గ్మ:

90వ దశకంలో సౌతిండియా సినీ పరిశ్రమను తన గ్లామర్‌తో ఉక్కిరి బిక్కిరి చేసిన హాట్ అండ్ సెక్సీ భామ నగ్మా అప్పట్లో తెలుగు, హిందీ, త‌మిళ్ తో పాటు 8 భాష‌ల్లో 60పైగా సినిమాల్లో యాక్ట్ చేసింది.హిందిలో స‌ల్మాన్ ఖాన్ నుంచి చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్ వంటి అగ్ర‌హీరోల‌తో న‌టించి మెప్పించిన ఈ హాట్ బ్యూటీ పాలిటిక్స్, మ‌త ప్ర‌చారాల‌తో హోరెత్తిస్తుంది.

Telugu Divya Vani, Raja, Mohini, Nagma-Movie

దివ్య వాణి: తెలుగుదేశం ఫైర్ బ్రాండ్.సంద‌ర్భానుసారం ప్ర‌త్య‌ర్ధుల‌పై నిప్పులు చెరిగే ఈ బాపు బొమ్మ.పెళ్లి పుస్తకం సినిమాతో బాగా పాపుల‌ర్ అయ్యింది.

వ‌రుస ఆఫ‌ర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా.మ‌తం మోజులో ప‌డి అవ‌కాశాల్ని తృణ ప్రాయంగా వ‌దిలేసుకుంది.

అప్పుడప్పుడు పొలిటిక‌ల్ కారిడార్ లో చ‌క్కెర్లు కొడుతూ మ‌త ప్ర‌భోద‌కురాలిగా బిజీ అయ్యారు.

Telugu Divya Vani, Raja, Mohini, Nagma-Movie

మోహిని : బాల‌య్య స‌ర‌స‌న ఆదిత్య 369 సినిమా చేసిన మ‌హాల‌క్ష్మి అలియాస్ మోహిని తమిళ్, తెలుగు, మలయాళ బాషల్లో 2011 వరకు 50కి పైగ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.అయితే సినీ కెరియ‌ర్ కొన‌సాగుతుండ‌గా.స‌డెన్ సినిమాల‌కు పులిస్టాప్ పెట్టి పెళ్లి చేసుకున్న ఆమె కొన్ని సమస్యల వల్ల సాంప్ర‌దాయ బ్రాహ్మ‌ణ కుటుంబంలో పుట్టిన మోహిని మతం మారి మ‌త ప్ర‌బోధ‌కురాలిగా స్థిర‌ప‌డింది.

Telugu Divya Vani, Raja, Mohini, Nagma-Movie.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube