హమ్మయ్య : రాజశేఖర్‌ కరోనాను జయించారు

టాలీవుడ్‌ నటుడు రాజశేఖర్‌ గత నెల రోజులుగా కరోనాతో పోరాడి ఎట్టకేలకు ఆయన పూర్తి ఆరోగ్యంతో బయట పడ్డారు.నిన్న ఆయన ఆరోగ్యం కుదుట పడ్డట్లుగా ప్రకటించి ఆసుపత్రి వర్గాలు ఆయన్ను డిశ్చార్జ్‌ చేశారు.

 Rajashekhar Discharged From Covid Hospital , Actor Raajsekhar, Shivatmika,jeevi-TeluguStop.com

నెల రోజులుగా సిటీ న్యూరో ఆసుపత్రిలో రాజశేఖర్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నాడు.వారు చూపంచిన శ్రద మరియు వారు అందించిన మెరుగైన చికిత్స వల్లే రాజశేఖర్‌ కోలుకున్నారు అంటూ జీవిత ఆనందం వ్యక్తం చేశారు.

ఆయన డిశ్చార్జ్‌ సందర్బంగా మీడియాతో మాట్లాడిన జీవిత ఆసుపత్రి వర్గాల వారికి ఎప్పటికి రుణపడి ఉంటాం అంటూ చెప్పుకొచ్చారు.రాజశేఖర్‌ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి కూడా జీవితతో పాటు శివాని మరియు శివాత్మికలు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆసుపత్రి వారితో ఫొటోలు దిగి వారి నుండి వీడ్కోలు తీసుకున్నారు.

రాజశేఖర్‌ ఇంకా ఆక్సీజన్‌ తీసుకోవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది.

అందుకే ఆయనకు ఆక్సీజన్‌ పైపును కంటిన్యూ చేస్తున్నట్లుగా ఫొటోను చూస్తే అర్థం అవుతుంది.ఖచ్చితంగా దాన్ని కూడా ఆయన త్వరలో తీసేసుకుని పూర్తి ఆరోగ్యంతో మళ్లీ నటించేందుకు సిద్దం అవుతాడు అంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు.

రాజశేఖర్‌ ఇద్దరు కూతుర్లు కూడా తండ్రి ఆరోగ్యం విషయంలో చాలా ఆందోళన వ్యక్తం చేశారు.ఒకానొక సమయంలో నాన్న ఆరోగ్యం కోసం మీరు అంతా ప్రార్థనలు చేయాలంటూ శివాత్మిక విజ్ఞప్తి చేసింది.

నెల రోజుల పోరాటం తర్వాత రాజశేఖర్‌ ఆరోగ్యంగా బయటకు వచ్చారు.ఆసుపత్రిలో రాజశేఖర్‌ ఉన్న సమయంలో పలు పుకార్లు సోషల్‌ మీడియాలో షికార్లు చేశాయి.

ఆ పుకార్లన్నింటికి కూడా ఫుల్‌ స్టాప్‌ పెట్టి రాజశేఖర్‌ ఆసుపత్రి నుండి ఇంటికి చేరారు అంటూ అభిమానులు ఆనందంను వ్యక్తం చేస్తున్నారు.రాజశేఖర్‌ ఆరోగ్యంగా డిశ్చార్జ్‌ అవ్వడంతో శివాని మరియు శివాత్మికలు షూటింగ్‌ లో జాయిన్‌ అవ్వబోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube