తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్ తొమ్మిదో వారం పూర్తి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ నుంచి తొమ్మిది మంది ఎలిమినేట్ కాగా.
ఈ వారం మరొకరు బ్యాగ్ సద్దేయనున్నారు.ఇదిలా ఉంటే.
ఈ సీజన్‌లో కాస్త స్పెషల్ ట్రాక్ ఎవరిదైనా ఉందా అంటే అది ముక్కు అవినాష్, అరియానాదే అని చెప్పాలి. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన అవినాష్ చాలా తక్కువ సమయంలోనే ఇంటి సభ్యులతో కలిపోయి స్ట్రాంగ్ కంటెస్టెంట్ మారిపోయాడు.
అలాగే యాంకర్ అరియానా గ్లోరీ మొదటి వారం తన ఓవరాక్షన్‌తో మిగిలిన కంటెస్టెంట్లను ఇబ్బంది పెట్టినా.ముక్కు సూటిగా వ్యవహరిస్తూ గేమ్ ఆడడంతో తర్వాత వారాల్లో మాత్రం బాగా పుంజుకుంది.
అయితే బిగ్ బాస్ మాత్రం వీరిద్దరి మధ్య ఏదో ఉందని చెప్పడానికి తెగ ప్రయత్నిస్తున్నాడు.టాస్క్‌లో క్యారెక్టర్లు కూడా వీరికి ఫేవర్‌గా ఉంటున్నాయి.ఇక అవినాష్, అరియానాల దగ్గర నుంచి బిగ్ బాస్ పావలా పెర్ఫామెన్స్ కోరుకుంటే.వారు మాత్రం రూపాయిన్నర పెర్ఫామెన్స్ చేసి ఇంటిని మరింత హీటెక్కిస్తున్నారు.
అయితే నిన్నటి ఎపిసోడ్‌లో మాత్రం అరియానాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు అవినాష్.నిన్న కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ `పల్లెకు పోదాం ఛలో ఛలో` అనే టాస్క్‌ను ఇంటి సభ్యులకు ఇచ్చారు.
ఈ టాస్క్‌లో హారిక అవినాష్‌కు కోపం తెప్పించి అరిపించేలా చేసి సీక్రెట్ టాస్క్‌ను పూర్తి చేసింది.ఈ విషయంపై అరియానా.అవినాష్ క్లాస్ పీకాలని ప్రయత్నించింది.
ఈ క్రమంలోనే టాస్కులో అనవసరంగా కోపానికి వస్తున్నావని చెప్పుకొచ్చిన అరియానా.
పల్లెకు పోదాం ఛలో ఛలో టాస్కులో వరస్ట్ పర్ఫామర్ ఎవరని బిగ్ బాస్ అడిగితే నీ పేరే చెప్పేదాన్ని అని ముఖం మీద చెప్పేసింది.దీంతో ఫీల్ అయిన అవినాష్.
నన్ను చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు.అది నాకు అస్సలు నచ్చట్లేదు, నా గురించి నువ్వు మాట్లాడకపోతేనే నీకు మంచిది` అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు.
మొత్తానికి ప్రేమ పావురాల్లా ఉంటున్న వీరిద్దరి మధ్య వివాదం ప్రారంభం అయింది.మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.