కోట్లు పోగొట్టుకొని చిల్లర కోసం వెతుక్కున్నట్లు.ప్రేమ కోసం పోరాడుతానంటూ స్టేట్మెంట్ ఇచ్చిన శృతి హాసన్ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి.విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తె అనే పేరు మాత్రమే కాకుండా తనకంటూ ఓ సప్రైట్ ట్రెండ్ సెట్ చేసుకున్న క్రేజీ హీరోయిన్ శృతిహాసన్.2011లో సిద్ధార్ధ్ సరసన అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి కెరియర్ బిగినింగ్ లో వరుస ఫ్లాప్ లతో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది.
2013లో హరీష్ శంకర్ డైరక్టర్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించిన గబ్బర్ సింగ్ సినిమాతో లక్కీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.బలుపు, రేసుగుర్రం, ఎవడు, శ్రీమంతుడు హిట్ తో తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎందిగింది.
ఇలా 2015 వరకు శృతీ హవా కొనసాగినా.కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు రాంగ్ డెషిషన్స్ తో సైడ్ ట్రాక్ లోకి వెళ్లింది.
లండన్ కు చెందిన ఆర్టిస్ట్ మైఖెల్ కోర్ల్సే తో లవ్ ఇష్క్ కాదల్ అంటూ ప్రేమలో మునిగి తేలింది.లవ్ పేరుతో కెరియర్ ను పక్కన పెట్టేసింది.
ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది.వీళ్లిద్దరికి పెళ్లెప్పుడవుతుంది బాబు అంటూ ఆమె అభిమానులు ఎదురు చూస్తుండగా.
శృతి బ్రేకప్ అంటూ బాంబ్ పేల్చింది.వెండితెర ఆఫర్లు కనుమరుగయ్యాయి.
బ్రేకప్ తరువాత లండన్ లో స్టేజ్ షోలు చేసింది.ఒకానొక సమయంలో కోట్లు కూడబెట్టిన శృతిహాసన్.
ఖర్చుల కోసం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి.ఆ ఎక్స్ పెరిమెంట్స్ వర్కౌట్ కాలేదు.
దీంతో మళ్లీ సినిమాలపై కన్నేసింది.సినిమాలకు సుదీర్ఘ విరామం తరువాత రవితేజ హీరోగా గోపీచంద్ డైరెక్ట్ చేస్తున్న క్రాక్ సినిమాలో యాక్ట్ చేస్తుంది.
లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా శృతీ హాసన్ సోషల్ మీడియాలో తనపై వస్తున్న రూమర్స్ గురించి పట్టించుకోనని తెలిపింది.
తాను పెట్టే పోస్ట్ లపైనే మాత్రమే స్పందిస్తానని తెలిపిన ఈ అగ్రెసీవ్ హీరోయిన్.ఓసారి ప్రేమలో విఫలమైన.
మళ్లీ అదే ప్రేమ కోసం పోరాటం చేస్తానని చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.