సిగ్గు చేటు : బాలు కంటే హీరోయిన్స్‌ డ్రగ్స్‌ కేసు ముఖ్యమైనది

గాన గంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం మృతిపై అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా కథనాన్ని ఇచ్చాయి.

 National Media Interest On Drugs Case Than Spb Death, National Media, Bbc News,-TeluguStop.com

ఆయన 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి 50 ఏళ్లకు పైగా ప్రేక్షకులను అలరించారు.అంతటి గొప్ప వ్యక్తి విషయంలో జాతీయ మీడియా వ్యవహరించిన తీరు చాలా దారుణం అంటూ ఇప్పటికే సినీ ప్రముఖులు మరియు మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జాతీయ మీడియాలో ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం మృతికి సంబంధించి పెద్దగా కథనాలు ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా ఉందంటూ సౌత్ సినీ అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

హీరోయిన్స్ బైట్స్ కోసం.డ్రగ్స్ కేసులో నిందితుల కోసం సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న జాతీయ మీడియాకు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రముఖుల మృతి పెద్దగా పట్టనట్లుగా ఉంది.వాళ్లకు హీరోయిన్స్ డ్రగ్స్‌ కేసుపైనే ఎక్కువ ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది.

ప్రేక్షకులు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం మృతి వార్తల కంటే ఎక్కువ ఆసక్తిని డ్రగ్స్‌ కేసుపై చూపిస్తారని ఉద్దేశంతో మన జాతీయ మీడియా ఛానల్స్ వ్యవహరించాయనిపిస్తుంది.అత్యంత దారుణంగా డ్రగ్స్‌ కేసు ఎంక్వౌరీ చూపిస్తూ బాలసుబ్రమణ్యం కథనాలను ప్రసారం చేయలేదు.ఈ విషయాన్ని ఇప్పటికే పలువురు దర్శకులు మరియు ఫిల్మ్ మేకర్స్ ఖండించారు.

జాతీయ మీడియా వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరిగా లేదు అంటూ వారు అసహనం వ్యక్తం చేశారు.ఇది అది అని కాదు దాదాపు అన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం గారి మృతిని చాలా లైట్ గా తీసుకున్నట్లుగా అనిపించింది.ఈ విషయమై జాతీయ మీడియా సంస్థలు సిగ్గు పడాలి అంటూ సౌత్ సినీ వర్గాల వారు వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరి ఈ విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు ఎలా స్పందిస్తాయి అనేది చూడాలి.సౌత్ మీడియా మాత్రం బాలు మృతిపై ప్రముఖంగా కథనాలు ప్రసారం చేసి ఆయనకు శ్రద్దాంజలి ఘటించాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube