ఇద్దరు ఒక్కరిని ఒక్కరు ప్రేమించుకున్నారు.పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాలని చాల కలలు కన్నారు.
ఇంతలో ఏమైందో తెలియదు కానీ ప్రియుడు ఆమెతో పెళ్ళికి నిరాకరించాడు.దీంతో కోపానికి గురైన యువతీ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ప్రియుడి ఇంటి ముందు వీరంగం సృష్టించింది.
ప్రేమించిన వ్యక్తితో పాటు, అడ్డు వచ్చినందుకు అతని తల్లిదండ్రులను కూడా చితక బాదింది.ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని జారౌలి ప్రాంతానికి చెందిన దీపక్, అదే ప్రాంతానికి చెందిన యువతి గత కొద్దీ కాలంగా ఒక్కరిని ఒక్కరు ప్రేమించుకుంటున్నారు.వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో చెప్పి పెళ్ళికి పెద్దలను ఒప్పించారు.దీంతో వారు ఎంగేజ్‌మెంట్ చేసుకొని లాక్ డౌన్ పెళ్లి జరిపించాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.
దేశంలో లాక్ డౌన్ ముగియడంతో యువతి పెళ్లి గురించి మాట్లాడగా దానికి దీపక్ నిరాకరించాడు.దీంతో కోపానికి గురైన యువతి దీపిక్ ఇంటికి వెళ్లి అతనిని కొట్టింది.
అంతటితో ఆగకుండా అడ్డొచ్చిన దీపక్ తల్లిదండ్రులను కూడా కొట్టింది.ఇరు కుటుంబాల మధ్య గొడవ పెద్దగా మారి ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటున్నారు.
దింతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకొని వారిని పోలీసు స్టేషన్ కి తరలించారు.బాధితుల ఫిర్యాదు మేరకు దీపక్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.